రాష్ట్రీయం

చందానగర్‌లో దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/శేరిలింగంపల్లి, జనవరి 29: సైబరాబాద్ పరిధిలోని చందానగర్‌లో దారుణం జరిగింది. ఒకేసారి ముగ్గురిని హత్య చేయడం రాష్టవ్య్రాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. ప్రియురాలు, కన్న బిడ్డతో పాటు అత్తను కూడా అంతమొందించిన దుర్మార్గుడు రెండు రోజుల తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం ప్రాంతంలోని పాలకొల్లుకు చెందిన అపర్ణ చందానగర్‌లోని వేముకుంటలో గల ఇంటి నెంబరు 1-131లో తన బిడ్డ కార్తికేయ (4), తల్లి విజయలక్ష్మి (55)లతో కలిసి అద్దెకు ఉంటున్నది. ఎల్‌జీ కంపెనీ తరపున చందానగర్‌లోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూంలో మొబైల్ ఫోన్స్ సేల్స్ ప్రమోటర్‌గా పనిచేస్తోంది. సోమవారం ఉదయం ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో అనుమానం వచ్చిన ఇరుగుపొరుగువారు గమనించగా ఇంటి తలుపునకు బయట నుంచి గడియ పెట్టి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. చందానగర్ ఇన్‌స్పెక్టర్ ఎన్.తిరుపతి రావు, ఎస్‌ఐ వేణు కుమార్, సిబ్బంది వచ్చి పరిశీలించడంతో ముగ్గురు హత్యకు గురైన విషయం వెలుగులోకి వచ్చింది. అపర్ణ తలపై రుబ్బురాయితో బలంగా కొట్టడంతో రక్తపు మడుగులో పడి ప్రాణాలు కోల్పోయింది. నాలుగేళ్ళ కూతురు కార్తికేయను గొంతు నులిమి చంపగా. అపర్ణ తల్లి విజయలక్ష్మి తలపై బలంగా కొట్టి అనంతరం రుమాలుతో ఆమె గొంతు బిగించి చంపినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. విషయం తెలుసుకున్న సైబరాబాద్ జాయింట్ సీపీ షానవాజ్ ఖాసిం, మాదాపూర్ జోనల్ డీసీపీ విశ్వప్రసాద్, కూకట్‌పల్లి ఏసీపీ భుజంగ రావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సైబరాబాద్ క్లూస్ టీంను పిలిపించి వేలి ముద్రలు సేకరించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న డాగ్ స్క్వాడ్ హత్యకు గురైన వారిని పోలీసు జాగిలానికి చూపించగా అది కొంతదూరం వెళ్ళి ఆగిపోయింది. ఆపర్ణ మొబైల్ ఫోన్ కాల్స్ ఆధారంగా వివరాలు సేకరించిన పోలీసులు పలువురిని విచారించి దర్యాప్తు ముమ్మరం చేశారు.
పీఎస్‌లో లొంగిపోయిన హంతకుడు
ముగ్గురి హత్యకు కారకుడుగా అనుమానిస్తున్న ఆర్.మధు మధ్యాహ్నం చందానగర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్టు తెలిసింది. విచారణ నిమిత్తం రామచంద్రాపురం పోలీస్ స్టేషన్‌కు మధును తీసుకెళ్ళగా అక్కడికి మీడియా రావడంతో అతన్ని మరో పీఎస్‌కు తరలించి విచారణ చేపట్టారు.
పాలకొల్లుకు చెందిన అపర్ణ, మధులకు దశాబ్దం క్రితం నగరంలోని ఓ మొబైల్ షాపులో పరిచయం ఏర్పడింది. వీరితో పాటు పనిచేసిన మరో వ్యక్తితో కూడా ఆమెకు పరిచయం ఉన్నట్టు పోలీసుల విచారణలో బయటపడింది. ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ముదరడంతో సహజీవనం చేస్తూ వచ్చారు.
కాగా, మధుకు తన మరదలితో అప్పటికే వివాహమైందనే విషయం తెలియడంతో ఇరువురి మధ్య కొట్లాటకు దారితీసింది. మధుకు ఇద్దరు కూతుళ్లు ఉండగా అపర్ణ ద్వారా మరో కూతురు పుట్టింది. మధుకు అప్పటికే పెళ్ళి అయిందనే విషయం తెలిసినప్పటి నుంచి అపర్ణ నిలదీస్తుండడంతో విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. మానసికవేదనకు గురై సహజీవనం చేస్తున్న అపర్ణను వదిలించుకోవాలని కుట్ర పన్నాడు.
27వ తేదీ మధ్యాహ్నం పీకలదాకా తాగిన మధు అపర్ణ ఉంటున్న ఇంటికి చేరుకుని రుబ్బురాయితో అత్త తలపై కొట్టడంతో ఆమె స్పృహతప్పి కిందపడిపోయింది. మఫ్లర్‌తో గొంతుకు ఉరి బిగించి చంపేశాడు. అనంతరం కూతురు కార్తికేయను గొంతు పిసికి చంపేశాడు. కొద్దిసేపటి తర్వాత మధ్యాహ్న భోజనానికి ఇంటికి వచ్చిన అపర్ణ వంటగదిలోకి వెళ్ళగానే తలపై రుబ్బురాయితో బలంగా కొట్టడంతో కుప్పకూలిపోయి రక్త మడుగులో పడి ప్రాణాలు వదిలింది.
ఇంటి తలుపులు వేసి బయటి నుంచి గడియ పెట్టిన మధు అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయి ఇల్లాలిని పుట్టింటికి పంపించాడు. కేపీహెచ్‌బీ కాలనీ 4వ ఫేజ్‌లో నివసిస్తున్న మధు ఇంటికి తాళం వేసి ఓ లాడ్జిలో ఉన్నట్టు తెలిసింది. పోలీసులు గాలిస్తున్న విషయం తెలుసుకున్న మధు చందానగర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయి జరిగినదంతా చెప్పినట్టు తెలిసింది.
శవ పంచనామా నిర్వహించిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. చందానగర్ ఇన్‌స్పెక్టర్ ఎన్.తిరుపతి రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చిత్రాలు.. సైబరాబాద్ పరిధిలోని చందానగర్‌లో హత్యకు గురైన అపర్ణ, ఆమె కుమార్తె కార్తికేయ,
హంతకుడు మధు (ఫైల్‌ఫొటో)