రాష్ట్రీయం

6 నుంచి రెడిమేడ్ వస్త్ర వ్యాపారుల సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 3: ఈ నెల 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు అపెరెల్ మ్యానుఫ్యాక్చరర్స్ వాణిజ్య వేత్తల సదస్సు హైటెక్స్ కనె్వంన్షన్ సెంటర్‌లో జరుగుతుందని అపెరెల్ మ్యానుఫ్యాక్చరెర్స్ ఇండియా నిర్వాహకుడు నిఖిల్ ఫురియా తెలిపారు. కర్నాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అపెరెల్ రెడీమేడ్ వస్త్ర తయారీ వాణిజ్యవేత్తలు ఈ సదస్సులో పాల్గొంటారని చెప్పారు. దాదాపు 135 ప్రముఖ బ్రాండ్ల నిర్వాహకులు పాల్గొంటారని చెప్పారు. ఎథోస్,జీవాంకీ, ఎరా, ఫైనల్ చాయిస్, టోర్సో షర్ట్స్ తదితర సంస్థలు పాల్గొంటాయని చెప్పారు. మ్యానుఫ్యాక్చరర్లు, రిటైలర్లు మధ్య ఉన్న సమన్వయం పెంపొందించేందుకు ఈ సదస్సు ఉపకరిస్తుందన్నారు. ఇంతవరకు తమ సంస్థ చెన్నైలో ఐదు సార్లు, కొచిలో ఆరు సార్లు, హైదరాబాద్‌లో ఒకసారి ఈ తరహా ప్రదర్శన, సదస్సులు నిర్వహించామన్నారు.
తొలి సాంకేతిక మ్యానువల్ ఆవిష్కరణ
ప్రి ఇంజనీర్డ్ స్టీల్ బిల్డింగ్స్‌కు పెరిగిపోతున్న తరుణంలో ఎవరెస్ట స్టీల్ బిల్డింగ్ సొల్యూషన్స్ ఇక్కడ పిఇబి సాంకేతికతపై మాన్యువల్‌ను ఆవిష్కరించింది. దేశంలో దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల మేరకు ఉన్న ఈ పరిశ్రమ ఉత్పత్తులను వేగవంతమైన, సురక్షితమైన, పారిశ్రామిక గోదాం, వాణిజ్య భవనాల నిర్మాణానికి అనువుగా ఉపయోగించుకోవచ్చని ఎండి మానిష్ సాంఘి తెలిపారు. ఇంతవరకు దక్షిణ భారతదేశంలో 50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ముఖ్యమై ప్రాజెక్టులకు సాంకేతిక మెటీరియల్‌ను డెలివరీ చేశామన్నారు. సత్యవాణి ప్రాజెక్‌ట్ట్స కనె్సల్టెంట్ పి సూర్యప్రకాశ్, ఎనఆర్ కనె్సల్టెంట్స్ సిఇవో వై నరసింహారావు, మోహన్ కన్సల్టెంట్ ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్ జి రాంమోహన్, కాంటినెంటల్ డిజైనర్స్ ప్రిన్సిపల్ కనె్సల్టెంట్ వివి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.