రాష్ట్రీయం

సకాలంలో విద్యుద్దీకరణ పనులు పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 3: రైల్వే చేపట్టిన విద్యుదీకరణ పనులు సకాలంలో పని చేయాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ అన్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో రైల్వే లైన్ల విద్యుదీకరణకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన నేపధ్యంలో ఎలక్ట్రికల్ ఇంజనీర్ల పాత్ర చాలా కీలకమని అన్నారు. రానున్న రోజుల్లో విద్యుదీకరణ ప్రాజెక్టులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందని అన్నారు. శనివారం నాడిక్కడ లాలాగూడలోని ఎలక్ట్రికల్ లోకోషెడ్‌లో 7వ రైల్వే ఎలక్ట్రికల్ ఇంజినీర్స్ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిఎం మాట్లాడుతూ ఎలక్ట్రికల్ ఇంజినీర్లకు చాలా మంచి భవిష్యత్తు ఉందని అన్నారు. రైల్వే మంత్రి, రైల్వే బోర్డు చైర్మన్లు సెమి హైస్పీడ్ రైళ్లు, హై స్పీడ్ ట్రైన్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నందున విద్యుదీకరణ ప్రాజెక్టులు మరిన్ని వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఇంధన పొదుపులో ప్రతి ఏడాది వరుసగా అవార్డులు వస్తున్నాయని, ఇదే ఒరవడిని కొనసాగించాలని అన్నారు. ఈ సందర్భంగా ఎలక్ట్రికల్ లోకో షెడ్ ఆవరణలో సిబ్బందితో కలిసి జిఎం మొక్కలు నాటారు. ఈ సమావేశంలో రైల్వే ఇంజినీర్లు, ఇతర విభాగాల అధిపతులు పాల్గొన్నారు.