రాష్ట్రీయం

ప్రధాన న్యాయమూర్తికి 11 మంది బాల్య వివాహ బాధితుల లేఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 3: బాల్యవివాహాల వల్ల ఎదుర్కొంటున్న బాధలపై 11 మంది బాధితులు రాసిన లేఖను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. తమకు బాల్యంలోనే వివాహాలు చేయడం వల్ల బాలల హక్కును కోల్పోయామని, అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నామని వారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. గర్భం దాల్చడం వల్ల ఒక బాలిక మరణించిందని, ప్రసవించిన శిశువులు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని లేఖలో పేర్కొన్నారు. సరైన ఆలనాపాలన లేకపోవడంతో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు, వివక్షకు గురవుతున్నట్లు వారు పేర్కొన్నారు. తమకు విద్యా సంస్థల్లో ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలని, నైపుణ్య పనులను నేర్పించాలని, తమపిల్లలకు పౌష్టికాహారం కల్పించాలని, ఆరోగ్య సదుపాయం కల్పించాలని కోర్టును అభ్యర్థించారు.