రాష్ట్రీయం

పెట్టుబడులతో దయచేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 3: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రవాసాంధ్రులకు రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనలో భాగంగా అట్లాంటాలో శనివారం కంపెనీల ప్రతినిధులు, ఎన్నారైలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు వివరించారు. సాంకేతికను సమర్ధవంతంగా వినియోగిస్తూ, వృద్ధి రేటును 12 నుంచి 15 శాతానికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ- ప్రగతి ప్లాట్‌ఫారం ద్వారా ప్రభుత్వ సమాచారాన్ని ఒక వేదికపై తీసుకువచ్చి, సింగిల్ సోర్సు ఆఫ్ ట్రూత్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో తెలివైన యువతకు సాంకేతిక శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఏపీలో కంపెనీలు ఏర్పాటు చేసే వారికి వివిధ రాయితీలతో పాటు అద్దెలో 50 శాతం రాయితీ ఇస్తున్నామన్నారు. టీడీపీ ఎన్నారై సమావేశంలోనూ మంత్రి లోకేశ్ మాట్లాడారు. గ్రామీణావృద్ధిలో భాగంగా సీసీ రోడ్లు, ఎల్‌ఇడి లైట్లు, భూగర్భ డ్రైనేజీ ఏర్పాటు వంటి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు.