రాష్ట్రీయం

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 6 నుంచి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం టౌన్, ఫిబ్రవరి 3: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం ముస్తాబవుతోంది. ఈనెల 6 నుంచి 16 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రతి రోజు స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక వాహనసేవలు ఉంటాయి. 6వ తేదీ ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. 7వ తేదీ భృంగివాహన సేవ, 8న హంసవాహనం, 9న మయూర వాహనం. 10న రావణ వాహనం, 11న పష్పపల్లకి సేవ, 12న గజవాహనం, 13న నందివాహనం, 14న రథోత్సవం, 16న అశ్వవాహన సేవలు ఉంటాయి. 13న మహాశివరాత్రి రోజు సాయంత్రం బ్రహ్మోత్సవం, రాత్రి 10 గంటలకు పాగాలంకరణ, అర్ధరాత్రి లింగోద్భవం, ఆ తరువాత స్వామి, అమ్మవార్ల కల్యాణం నిర్వహిస్తారు. మరుసటి రోజు రథోత్సవం ఉంటుంది. శ్రీగిరికి తరలివచ్చే భక్తులకు దేవస్థానం వారు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. పాతాళగంగ వద్ద పుణ్యస్నానాలు ఆచరించేందుకు వసతులు కల్పిస్తున్నారు.