రాష్ట్రీయం

ముదిరిన మిత్రభేదం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 5: మిత్రపక్షమైన తెలుగుదేశం- భారతీయ జనతా పార్టీ మధ్య మిత్రభేదం ముదురు పాకాన పడింది. రెండు ఎకరాలతో వచ్చిన వాళ్లు లక్షల కోట్లు ఎలా సంపాదిస్తారంటూ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన విమర్శలపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. రాష్టవ్య్రాప్తంగా ఆయన దిష్టిబొమ్మలు దగ్ధం చేశాయి. సోముకు కౌన్సిలర్‌గా గెలిచే దమ్ములేదని, ఆయన వైసీపీ ఏజెంటంటూ తెదేపా మండిపడింది. దీనిపై ఆగ్రహించిన వీర్రాజు.. బాబుకు దమ్ముంటే తన ప్రశ్నలకు జవాబివ్వాలని సవాల్ చేసి తానెక్కడా తగ్గేది లేదని, తననెవరూ భయపెట్టలేరని తేల్చేశారు. విజువల్ మీడియాలోనూ టీడీపీపై ఎదురుదాడికి దిగారు. దీంతో నష్టనివారణకు దిగిన టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు తన పార్టీ శ్రేణులను వారించక తప్పలేదు. సోము దిష్టిబొమ్మలను దగ్ధం చేయవద్దని ఆదేశించారు.
బడ్జెట్ కేటాయింపుల వ్యవహారం రాష్ట్రంలో టీడీపీ- బీజేపీ మధ్య చిచ్చు రాజేసింది. బడ్జెట్ బాగుందని, రాయపాటి, టీజీ వెంకటేష్‌లాంటి ధనవంతుల కోసం కాకుండా పేదల కోసం రూపొందించిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యానించటం తెదేపాలో అగ్గి రాజేసింది. మరోపక్క కర్నూలు సభలో మాట్లాడుతూ తమది కొడుల కోసం పుట్టిన పార్టీ కాదని, రెండెకరాలున్న వాళ్లు ఈరోజు లక్షల కోట్లు ఎలా సంపాదిస్తున్నారని నిలదీశారు. కేంద్ర పథకాలు కొంతమందికి ఆదాయవనరుగా మారాయని దుయ్యబట్టారు. దాంతో భగ్గుమన్న టీడీపీ శ్రేణులు రాష్టవ్య్రాప్తంగా సోము దిష్టిబొమ్మలు దగ్ధం చేశాయ. బెజవాడలో ఆయన ఫ్లెక్సీని చెప్పులతో కొట్టి తగులబెట్టారు. రాజమండ్రిలోని ఆయన కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. దీనిపై మండిపడిన సోము వీర్రాజు వివిధ టీవీల చర్చా వేదికల్లో చంద్రబాబుకు దమ్ముంటే తన ప్రశ్నలకు జవాబు చెప్పాలని సవాల్ విసిరి మరింత వేడి పెంచారు.
నోరు జాగ్రత్త: మంత్రి అయ్యన్న
టీడీపీ, సీఎంపై ఆరోపణలు చేస్తున్న సోము వీర్రాజు నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలని మంత్రి అయ్యన్నపాత్రుడు హెచ్చరించారు. సోము వీర్రాజు సోంబేరి వీర్రాజుగా వ్యవహరిస్తున్నారన్నారు. పార్టీలు మారిన పురంధ్రీశ్వరి కూడా టీడీపీ గురించి మాట్లాడటం వింతగా ఉందన్నారు. తమ పార్టీ, అధినేతపై సోము వీర్రాజు చేసిన ఆరోపణలపై మండిపడిన విజయవాడ, కృష్ణా జిల్లా టీడీపీ శ్రేణులు సోమవారం ఆయన దిష్టిబొమ్మలు దగ్థం చేసి, ఫొటోను చెప్పులతో కొట్టారు. ఆయన వైసీపీ ఏజెంటుగా వ్యవహరిస్తున్నారని కార్యకర్తలు నినాదాలు చేశారు. కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు
మాట్లాడుతూ సోము విశ్వాసం లేని ద్రోహిలా మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. సోమును బీజేపీ అధ్యక్షుడు హరిబాబు సంజాయిషీ కోరి క్షమాపణ చెప్పించేవరకూ ఆందోళన ఆగదని స్పష్టం చేశారు.
సోము వీర్రాజు వైసీపీకి అమ్ముడుపోయారని, వార్డు మెంబరుగా కూడా గెలవలేని ఆయనను తమ పార్టీనే ఎమ్మెల్సీగా చేసిందని ఎమ్మెలీ, విజయవాడ నగర టీడీపీ అధ్యక్షుడు బుద్దా వెంకన్న విరుచుకుపడ్డారు. అవినీతి పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీని ఎందుకు తీసుకున్నారని నిలదీశారు. సోము వీర్రాజు వైసీపీ ఏజెంటుగా పనిచేస్తున్నారని గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆరోపించారు. సోము బీజేపీలో పార్ట్‌టైమ్, వైసీపీలో ఫుల్‌టైమర్‌గా పనిచేస్తున్నారన్నారు. ఇదిలావుంటే, బీజేపీపై ఒక వ్యూహం ప్రకారం టీడీపీ చేస్తున్న ఆరోపణలపై చంద్రబాబు బహిరంగంగా స్పందించాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర పథకాలపై మోదీ ఫొటోలు పెట్టాలనడం ఎలా తప్పవుతుందని ప్రశ్నించారు. 175 సీట్లలోనూ పోటీ చేసేందుకు బీజేపీ సిద్ధమవుతోందని చెప్పారు.
వ్యక్తిగత విమర్శలొద్దన్న బాబు
ఇరు పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధాన్ని నివారించేందుకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు రంగంలోకి దిగారు. సోము దిష్టిబొమ్మలు తగులబెడుతున్నారన్న వార్తలు తెలుసుకున్న బాబు.. ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేసి, వారి స్థాయికి దిగజారవద్దన్నారు. దిష్టిబొమ్మలు తగులపెట్టవద్దని హెచ్చరించారు. వ్యక్తిగత వ్యాఖ్యలకు విలువ ఉండదన్నారు. శ్రేణులు సంయమనం పాటించాలని, బడ్జెట్‌లో అన్యాయంపై ఢిల్లీ స్థాయిలో ఒత్తిడి చేస్తున్నామన్నారు.
బాబు జవాబివ్వాల్సిందే: సోము
తాను చేసిన ఆరోపణలకు దమ్ముంటే చంద్రబాబే జవాబివ్వాలని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సవాల్ చేశారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే దాన్ని విచారించి మాకు అండగా ఉండాల్సింది పోయి, మీరేదో బాధపడుతున్నారంటూ ఒక టీవీ చానెల్‌పై విరుచుకుపడ్డారు. తమ మంత్రి మాణిక్యాలరావు తనను టీడీపీ నేతలు ఇబ్బందిపెడుతున్నారని సీఎంను 20 సార్లు కలిసి చెబితే పట్టించుకోని టీడీపీ, మిత్రధర్మం గురించి మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. బాబు గురించి చెప్పాల్సింది ఇంకా ఉందన్నారు. మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి ఇస్తున్నవి చెప్పకుండా అడ్డుకోవడం దుర్మార్గమన్నారు.