రాష్ట్రీయం

12నుంచి జల సంరక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 5: రాష్ట్రంలో జల సంరక్షణ, సమర్థ నీటి నిర్వహణకు మరోసారి ఉద్యమ స్ఫూర్తితో పని చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు నిర్దేశించారు. ఈనెల 12నుంచి జూన్ 7 వరకు 116 రోజులపాటు ‘జల సంరక్షణ ఉద్యమ స్ఫూర్తి -రెండో దశ’ పేరుతో పనులు చేపట్టాలని సూచించారు. ఏదైనా ప్రాధాన్య ప్రాజెక్టు ప్రారంభించడం ద్వారా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి చెరువుల పునరుద్ధరణ, కాలువల మరమ్మతులు, చెక్‌డ్యాంల నిర్మాణం, పంటకుంటల తవ్వకం వంటి పనులు పెద్దఎత్తున తలపెట్టాలని చెప్పారు. గతేడాది ఇదే సమయంలో చేపట్టిన మొదటి దశ పనుల ఫలితాలను, ప్రజలకు చేకూరిన ప్రయోజనాలను విశే్లషించాలని సోమవారం సచివాలయంలో జరిగిన పోలవరం, ప్రాధాన్య ప్రాజెక్టుల సమీక్షలో అన్నారు. రాష్ట్రంలో మొత్తం 16వేల గ్రామాల్లో వాటర్ ఆడిటింగ్ తప్పనిసరిగా జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. నీటి నిల్వలు సమకూర్చడమే కాకుండా, నాణ్యమైన నీటిని అందించడం ముఖ్యమని చెప్పారు. ఒక మీటర్ మేర భూగర్భ జలాలు పెరిగితే రూ. 250 కోట్ల విలువైన విద్యుత్ ఆదా చేయొచ్చని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. భూగర్భ జలాల పెంపు ద్వారా 2017-18లో రూ. 488 కోట్ల విలువైన విద్యుత్ ఆదా చేశామన్నారు. ఈ ఏడాది 2018, మే నాటికి 12.91 మీటర్ల మేర భూగర్భ జలాలు ఉండొచ్చని చెప్పారు.
పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంలో ఇంకా కొలిక్కిరాని పైపులైను, పంపుల బిగింపు పనులు వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. మారాల, చెర్లోపల్లి రిజర్వాయర్లు, పులకుర్తి ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తి చేసి ఈ నెలలోనే ప్రారంభించాలని, అలాగే కొండవీటి ప్రాజెక్టును ఏప్రిల్ నాటికి సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ‘గోదావరి - పెన్నా అనుసంధానం మొదటి దశ’ ప్రణాళికలను అధికారులు ముఖ్యమంత్రి ముందుంచారు. పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల పథకాల ద్వారా మొత్తం 15,370 క్యూసెక్కుల గోదావరి నీటిని తరలించవచ్చని చెప్పారు. 1,370 క్యూసెక్కుల జలాలు వృథాగా పోయినా 7వేల క్యూసెక్కులను కృష్ణా డెల్టాకు వినియోగించవచ్చని, మిగిలిన 7వేల క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ కుడి కాలువకు ఎత్తిపోయొచ్చని తెలిపారు.
గోదావరి - పెన్నా అనుసంధానం మొదటి దశకు మొత్తం 1,778 ఎకరాలు సీకరించాల్సి ఉంటుందని వెల్లడించారు. మొదటి దశ కార్యరూపం దాల్చడానికి రూ. 4,617 కోట్లు వ్యయం కానుందని అంచనా వేశారు. అలాగే మొత్తం 5 దశల్లో చేపట్టాలని భావిస్తున్న గోదావరి - పెన్నా అనుసంధానానికి రూ. 83,565 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని అధికారులు లెక్క తేల్చారు. అధికాదాయం సముపార్జిస్తున్న ఆక్వా రంగానికి మరింత ఊతం
ఇవ్వాలని, ఆక్వా రంగం వల్ల తలెత్తే కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు ఉమ్మడిగా ‘కాలుష్య నియంత్రణ ప్లాంట్’ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులతో అన్నారు. అవసరమైతే ప్రభుత్వమే ఈ ఖర్చును భరించాలని సూచించారు. సమీక్షలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, ఈఎస్‌సీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.