రాష్ట్రీయం

మన సత్తా చూపిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 5: ‘ఈ బడ్జెట్‌లో కేంద్రం నుంచి రాష్ట్రానికి ప్రత్యేకంగా కేటాయింపులు జరుపలేదు. అయినా మన సమర్థత చూపి శాఖాపర కేటాయింపుల్లో రాష్ట్రానికి ఎక్కువ నిధులు రాబట్టుకోవాలి’ అని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. సోమవారం నీరు- ప్రగతి, వ్యవసాయం పురోగతిపై జరిగిన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించా రు. కేంద్ర బడ్జెట్ ద్వారా ఏ శాఖకు ఎన్ని నిధులిచ్చే అవకాశం ఉందో అంచనాలు రూపొందించాలన్నారు. గరిష్టంగా కేంద్రం నుంచి ఎంత తెచ్చుకోవచ్చో అనే దానిపై శాఖాపర కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. నరేగాకు ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో రూ.55వేల కోట్లు పెట్టినప్పటికీ, సప్లిమెంట్‌గా మరో రూ.10వేల కోట్లు కలిపి రూ.65వేల కోట్ల బడ్జెట్ అందుబాటులో ఉంటుందని అధికారులు వివరించారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ ఈ ఏడాది నరేగా నిధులు రూ.7వేల కోట్లు మన రాష్ట్రం
వినియోగించుకోవాలని సూచించారు. నరేగా పనిదినాల సంఖ్య 23 కోట్లకు చేరుకోవాలన్నారు. ఉపాధి, కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లించాలని, మెటీరియల్ కాంపొనెంట్ నిధుల వినియోగం 40 శాతానికి మించకుండా చూడాలని, లేబర్ కాంపొనెంట్ పెంచుకోవాలని దిశా నిర్దేశం చేశారు. వాటర్ షెడ్స్ రెండవ దశ పనులు మార్చి నెలాఖరుకు పూర్తి చేయాలన్నారు. ఈ బడ్జెట్‌లో క్షీర విప్లవం, నీలి విప్లవానికి రూ.10వేల కోట్లు పైబడి కేటాయించిన అంశం ప్రస్తావించి, ఈ నిధులను రాష్ట్రంలోని ఆక్వా రైతాంగం, పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మత్స్యరంగం, పశుసంవర్ధక రంగంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెరుగుకు ఈ నిధులు వినియోగించుకోవాలన్నారు. అన్ని జిల్లాలు పశుగ్రాసం సాగుపై దృష్టి పెట్టాలని, వేసవిలో పశుగ్రాసం కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. మత్స్యశాఖను కూడా నరేగాకు అనుసంధానం చేసిన విషయం ప్రస్తావించి తీర ప్రాంతం అధికంగా ఉన్న మన రాష్ట్రం దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామాల్లో పంట కుంటలతో పాటు చేపల కుంటలకు కూడా నరేగా పథకాన్ని వినియోగించుకోవాలని, రైతుల ఆదాయాలు పెంచుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
ప్రతి పంచాయతీకి హెల్త్ బులెటిన్ విడుదల
ప్రతి నెలా ప్రతి పంచాయతీకి హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. పోషకాహార లోపంపై గ్రామాలవారీగా ప్రజలను చైతన్యపరచాలని కోరారు. రాష్ట్రంలో ఊబకాయం, పౌష్టికాహార లోపం పెరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. వీటిపై అధికార యంత్రాంగం దృష్టిపెట్టి ఆయా సమస్యలను అధిగమించాలన్నారు. వివిధ శాఖలకు సంబంధించి ప్రజల నుంచి అందిన వినతులన్నీ సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. రాష్టవ్య్రాప్తంగా గాలి స్వచ్ఛతపై అందరూ దృష్టి పెట్టాలన్నారు. కాలుష్యాన్ని నియంత్రించాలన్నారు. ఇస్రో, కాలుష్య నియంత్రణ మండలి సమన్వయంగా పనిచేయాలన్నారు. టెలీకాన్ఫరెన్స్‌లో గ్రామీణాభివృద్ధి, పశుగణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శులు జవహర్‌రెడ్డి, గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ రామాంజనేయులు, జలవనరులశాఖ చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు, రియల్ టైం గవర్నెన్స్ సీఈవో అహ్మద్‌బాబు, మత్స్య, ఆర్ధిక శాఖల అధికారులు రాంశంకర్ నాయక్, సునీత, ఇస్రో రాజశేఖర్, వివిధ జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.