రాష్ట్రీయం

‘పోలవరం’పై అర్ధసెంచరీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 5: జలవనరులతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు సంకల్పించిన సీఎం చంద్రబాబు అరుదైన ఘనత సాధించారు. పోలవరం ప్రాజెక్టుపై నిరంతరం శ్రమిస్తున్న సీఎం, 50వ సారి వర్చువల్ రివ్యూ నిర్వహించారు. సోమవారం సచివాలయంలోని తన కార్యాలయంలో పోలవరం సహా ప్రాధాన్య ప్రాజెక్టుల పనుల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు 53 శాతం పూర్తయిందని, కుడి ప్రధాన కాలువ 91శాతం, ఎడమ ప్రధాన కాలువ 60 శాతం నిర్మాణం పూర్తి చేసినట్టు అధికారులు వివరించారు. హెడ్ వర్క్స్ 39 శాతం పూర్తికాగా, డయాఫ్రమ్ వాల్ నిర్మాణం 66 శాతం అయిందన్నారు. 71 శాతం వరకు స్పిల్‌వే, స్పిల్ చానల్ తవ్వకం పనులు, 14 శాతం మేర కాంక్రీట్ నిర్మాణం చేపట్టడం జరిగిందని వెల్లడించారు. రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 58 శాతం పూర్తయిందని చెప్పారు. 82వేల క్యూబిక్ మీటర్ల వరకు ఎర్త్‌వర్క్ తవ్వకం పనులు, 5,314 క్యూబిక్ మీటర్ల వరకు స్పిల్‌వే, స్టిల్లింగ్ బేసిన్ కాంక్రీట్ పనులు, 18.8 మీటర్ల మేర డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఈ వారం రోజుల్లో చేపట్టినట్టు ముఖ్యమంత్రికి తెలిపారు.
బాబుకి పలువురి అభినందనలు
పోలవరం ప్రాజెక్టు సాధనే ధ్యేయంగా మూడున్నరేళ్ల నుంచి అహోరాత్రులు అంకితభావంతో పనిచేస్తున్నారంటూ ముఖ్యమంత్రిని ఈ సందర్భంగా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జలవనరులశాఖ
అధికారులు అభినందించారు. గతంలో ఏ పాలకుడు చేయని విధంగా ప్రతి సోమవారం పోలవరం నిర్మాణం పురోగతిని పరిశీలిస్తూ పనులను పర్యవేక్షిస్తూ, యంత్రాంగాన్ని నిర్దేశిస్తూ ప్రాజెక్టుపై తన చిత్తశుద్ధిని ముఖ్యమంత్రి చాటుకున్నారని కొనియాడారు. సమీక్షలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

చిత్రం..పోలవరం, ఇతర ప్రాధాన్య ప్రాజెక్ట్‌లపై సమీక్షిస్తున్న సీఎం చంద్రబాబు