రాష్ట్రీయం

మరింత విస్తరిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5: పంచాయతీరాజ్ చట్టం ద్వారా సంస్కరణలకు శ్రీకారం చుట్టాలని భావిస్తున్న ప్రభుత్వం, తర్వాత మున్సిపల్ చట్టంలోనూ మార్పులు తీసుకురావాలని భావిస్తోంది. ఆ లోగా రాష్టవ్య్రాప్తంగా కొత్త నగర పంచాయతీలు, మున్సిపాలిటీను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. 15 వేల జనాభా దాటిని గ్రామాలను నగర పంచాయతీలుగా, మున్సిపాలిటీలుగా మార్చడంతో పాటు హైదరాబాద్ మహానగరం పరిధిలో మరికొన్ని సర్కిళ్లు, జోన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశంపై సోమవారం హైదరాబాద్ మహానగర పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీలతో మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చర్చించారు. కొత్త నగర పంచాయతీలు, మున్సిపాలిటీలపై ప్రజా ప్రతినిధులతో ప్రతిపాదనలు తీసుకోవాల్సిందిగా అధికారులను మంత్రి ఆదేశించారు. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ లోపల ప్రస్తుతం 167 గ్రామాలు ఉన్నాయని, వీటి భౌగోళిక స్వరూపం ప్రకారం కొత్త మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేయాలా? లేక ప్రస్తుతం ఉన్న మున్సిపాలిటీల్లో విలీనం చేయాలా? అనే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు మంత్రి వివరించారు. జనాభా ప్రాతిపదికన అవుట్ రింగ్‌రోడ్‌కు లోపలున్న అమీన్‌పూర్, బొల్లారం, కొంపల్లి, పుప్పాలగూడ, ప్రగతినగర్, తెల్లాపూర్, కొల్లూరు, తుర్కయాంజాల్‌లను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు మంత్రి వివరించారు. జనాభా 15 వేలకు మించితే కచ్చితంగా నగర పంచాయతీలుగా, మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించిందన్నారు. గ్రామాలను నగర పంచాయతీలుగా, మున్సిపాలిటీలుగా మార్చడం వల్ల కలిగే ప్రయోజనాలు ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యేలకు మంత్రి సూచించారు. మున్సిపాలిటీలుగా మార్చడం వల్ల ఇంటి పన్ను పెరుగుతుందనే అభిప్రాయం ప్రజల్లో ఉంటుందని, అయితే కొత్తగా ఏర్పాటు చేసే నగర పంచాయతీలు, మున్సిపాలిటీలలో రెండు సంవత్సరాల వరకు పన్నుల పెంపు ఉండదని మంత్రి కెటిఆర్ స్పష్టం చేసారు. మంత్రి నిర్వహించిన ఈ సమావేశానికి రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం, కుత్బుల్లాపూర్, మహేశ్వరం, సంగారెడ్డి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు భువనగిరి ఎంపి బూర నర్సయ్య, రంగారెడ్డి, మేడ్చెల్, సంగారెడ్డి జిల్లాల కలక్టర్లు హాజరయ్యారు.

చిత్రం..కొత్త మున్సిపల్ చట్టంపై మంత్రులు, ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో మంత్రి కేటీఆర్