రాష్ట్రీయం

మావోల విధ్వంసకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఫిబ్రవరి 5: మావోయిస్టులు సోమవారం తలపెట్టిన తెలంగాణ రాష్టబ్రంద్ ఉద్రిక్తతకు దారితీసింది. చత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లోని భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి జిల్లాల పరిధిలో బంద్ ప్రభావం అధికంగా కనిపించింది. వ్యాపారులు తమ దుకాణాలను మూసివేయగా బస్సులు సైతం సరిగ్గా తిరగలేదు. చత్తీస్‌గఢ్ రాష్ట్రంనుంచి భద్రాచలం, హైదరాబాద్ ప్రాంతాలకు నిత్యం తిరిగే ప్రైవేటు బస్సులు పూర్తిగా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మావోయిస్టులు బంద్ సందర్భంగా బీఎస్‌ఎన్‌ఎల్ సెల్‌టవర్‌ను పేల్చివేశారు. భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలం ఎదిర గ్రామంలోని బీఎస్‌ఎన్‌ఎల్ టవర్‌ను పేల్చివేయడంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు సరిహద్దులోని దంతెవాడ జిల్లా పరిధిలోని భచేలి, భాన్సీ మధ్యలో రైలు పట్టాలను తొలగించడంతో అటుగా వెళ్తున్న గూడ్స్‌రైలు ఆరు బోగీలు పట్టాలుతప్పాయి. దీంతో రైళ్ళ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని, అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, అందుకోసం ప్రత్యేక పోలీస్ క్యాంపులను ఏర్పాటు చేస్తూ అలజడి సృష్టిస్తున్నాయని ఆరోపిస్తూ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్‌కు మద్దతివ్వాలంటూ రాష్టన్రేత ఆజాద్ పేరుతో ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ క్రమంలో బంద్‌ను విజయవంతం చేయాలని మావోయిస్టులు, దానిని అడ్డుకోవాలని పోలీసులు ప్రయత్నాలు చేయగా ఈ క్రమంలో సామాన్య పౌరులు ఇబ్బందులు పడ్డారు. అటవీ ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా సామాన్య ప్రజలు తమ ఇళ్ళను విడిచి బయటకు రాలేదు. మరోవైపు పోలీసులు మాత్రం అదనపు బలగాలతో విస్తృతంగా కూంబింగ్ నిర్వహించారు. రెండురోజుల క్రితం మావోయిస్టులకు, పోలీసులకు ఎదురుకాల్పులు జరిగిన ప్రాంతం భద్రాద్రి జిల్లా చర్లకు సరిహద్దులోనిది కావడంతో ఆ ప్రాంతం మరింత ఉద్రిక్తతకు దారితీసింది. తోగ్గూడెం ఔట్‌పోస్టుపై మావోయిస్టులు దాడిచేసిన నేపథ్యంలో ఈ పరిస్థితి నెలకొన్నది. అయితే బంద్ సందర్భంగా మావోయిస్టులు మరోసారి దాడులకు పాల్పడుతారనే సమాచారంతో పోలీసులు అదనపు బలగాలను రప్పించారు.

చిత్రం..దంతెవాడ జిల్లాలో రైలుపట్టాలు తొలగించడంతో పట్టాలు తప్పిన గూడ్స్