రాష్ట్రీయం

గెలుపు మాదే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 8: కాంగ్రెస్ పార్టీని తీవ్రపదజాలంతో విమర్శించిన రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటీరామారావు, టీఆర్‌ఎస్ పార్టీపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విలేఖర్లతో మాట్లాడుతూ, కేటీఆర్ మూర్ఖపువ్యాఖ్యలు చేశారని విమర్శించారు. రాహుల్‌పై చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ఉపసంహరించుకోవాలన్నారు. రాహుల్ టీఆర్‌ఎస్ నేతలా దోపిడీదారుడు కాదన్నారు. మిషన్ భగీరథలో సగం కాంట్రాక్టులు టీఆర్‌ఎస్ పార్టీ నేతలవేనన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేతకానితనంతో కేంద్రం నిధులు ఇవ్వలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పాటు తాను కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. కాంగ్రెస్ నేతలు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని చెప్పారు. నల్లగొండ కాంగ్రెస్ నేత హత్యపై ధైర్యం ఉంటే సీబీఐ చేత విచారణ జరిపించాలన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 70 సీట్లకు పైగా వస్తాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ పార్టీని లోఫర్ పార్టీగా పేర్కొనడం సిగ్గుచేటన్నారు. రాహుల్‌గాంధీని పప్పు అనడం కేటీఆర్ అహంకారానికి నిదర్శనమన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబానికి చెందిన వ్యక్తి రాహుల్ గాంధీ అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తన కుమారుడిని తన అదుపులో పెట్టుకోవాలన్నారు. టీపీసీసీ అధికార ప్రతినిధి శ్రవణ్ దాసోజు విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని తీవ్రపదజాలంతో విమర్శించి తన అనైతిక దిగజారుడుతనాన్ని మంత్రి కేటీఆర్ బహిర్గతం చేసుకున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుందని తెలిసి కూడా త్యాగంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ఆచరణకు ఆమోదయోగ్యం కాని హామీలు ఇచ్చి ఇష్టా రాజ్యంగా ప్రజాసంఘాలపై దాడులు చేస్తూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. రాహుల్‌ను విమర్శించిన కెటిఆర్ తన కుటుంబ సభ్యులతో ఎందుకు సోనియాగాంధీని కలిశారో వివరించాలన్నారు. కెసిఆర్ ఉద్రేకపూరిత ప్రసంగాల వల్ల 1500 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మార్పణ చేసుకున్నారన్నారు. తెలంగాణలో రాయలసీమ ఫ్యాక్షనిజం పోయి టిఆర్‌ఎస్ ఫ్యాక్షనిజం మొదలైందన్నారు. కెటిఆర్ మాట్లాడిన మాటలకు ఏ మాత్రం ఆత్మాభిమానం ఉన్నా తక్షణమే టీఆర్‌ఎస్ ఇచ్చిన పదవులను వదులుకుని బయటకు రావాలని ఆయన కోరారు. బీజేపీకి, టీఆర్‌ఎస్‌కు ఉన్న రహస్య ఎజెండాను బహిర్గతం చేయాలన్నారు. ప్రభుత్వ అవకతవకలను నిలదీసే వారిపైన 506, 509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తూ అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్నారన్నారు.

చిత్రం..మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్దం చేస్తున్న కాంగ్రెస్ నేతలు