రాష్ట్రీయం

‘నీట్’గా డ్రెస్ వేసుకుంటేనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 10: దేశవ్యాప్తంగా మెడిసిన్, డెంటల్ యుజి కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్ యుజి-2018) నోటిఫికేషన్‌ను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ జారీ చేసింది. ప్రకటించిన నిబంధనల ప్రకారం నీట్‌గా డ్రెస్ వేసుకున్న వాళ్లనే పరీక్షకు అనుమతిస్తామని ముందే సూచించింది. అఖిల భారత కోటా సీట్లు, రాష్ట్ర ప్రభుత్వ కోటా సీట్లు, సెంట్రల్ ఇనిస్టిట్యూట్‌లు, యూనివర్శిటీలు, డీమ్డ్ వర్శిటీలు, ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీలు, సెంట్రల్ పూల్ కోటా సీట్లను నీట్ ద్వారానే భర్తీ చేస్తారు. మే 6న జాతీయ ప్రవేశ పరీక్ష జరుగుతుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీల్లో 180 ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైప్‌లో ఇస్తారు. ప్రతి సరైన జవాబుకు నాలుగు ఆప్షన్లు ఉంటాయి. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ మూడు గంటలపాటు
పరీక్ష జరుగుతుంది. మార్చి 9 వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వీలుంది. 17 ఏళ్లు నిండి, 25లోపు వారు మాత్రమే నీట్ రాసేందుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఐదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంది. ఇంటర్‌లో జనరల్ అభ్యర్ధులు 50 శాతం, మిగిలిన రిజర్వుడ్ అభ్యర్ధులు 45 శాతం ఉంటే సరిపోతుంది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు కూడా ఆల్ ఇండియా కోటాలో చేరాలని నిర్ణయించడంతో ఈ రెండు రాష్ట్రాల అభ్యర్ధులు జాతీయస్థాయిలో 15 శాతం కోటాకు అర్హులయ్యారు. జూన్ 5న జాతీయ ఫలితాలు వెల్లడిస్తారు. ఇందుకోసం తెలుగు రాష్ట్రాల్లో 13 ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆంధ్రలో గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్టణం, విజయనగరం పట్టణాలను ప్రాంతీయ కేంద్రాలుగా ఏర్పాటు చేసింది. తెలంగాణలో హైదరాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, ఖమ్మం పట్టణాలను ప్రాంతీయ కేంద్రాలుగా ఎంపిక చేసింది.
పరీక్షకు డ్రెస్‌కోడ్
నీట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు అంతా హాఫ్ స్లీవ్‌లనే వేసుకోవాలని నిబంధన విధించింది. అలాగే పెద్ద గుండీలు, షర్టుపై లేదా అమ్మాయిల డ్రెస్‌లపై పెద్ద పువ్వులు, అదనపు ఎంబోజింగ్ బొమ్మలు, కోడ్‌లు, స్లోగన్‌లు ఉండరాదని ముందే సూచించింది. ప్రతిసారీ క్షుణ్ణంగా అభ్యర్ధులను తనిఖీ చేయడంపై వివాదం చెలరేగడంతో ఈసారి నీట్ కమిటీ ముందుగానే అభ్యర్ధులకు కఠినమైన నిబంధనలు విధించింది. ఎవరూ హై హీల్స్ వాడరాదని, సాధారణ చెప్పులు మాత్రమే వేసుకోవాలని, బూట్లు ఉపయోగించరాదని కూడా పేర్కొంది. అలాగే మెడల్లో ఆభరణాలు కూడా ధరించవద్దని సూచించింది. చేతికి వాచీలు కూడా ఉండరాదని సూచించింది.