రాష్ట్రీయం

50వేల కోట్లతో 19 లక్షల ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 10: రాష్ట్రంలో 2019 నాటికి రూ. 50 వేల కోట్లతో 19 లక్షల ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర సమాచార, గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శనివారం రాజమహేంద్రవరం వచ్చిన మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు. అనంతరం గృహ నిర్మాణంపై అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో అన్ని విభాగాల్లో మొత్తం 19 లక్షల ఇళ్లను నిర్మించేందుకు లక్ష్యంగా తీసుకుంటే అందులో 13 లక్షల ఇళ్ళను గ్రామీణ ప్రాంతాల్లోనే నిర్మించనున్నామన్నారు. ఇప్పటి వరకు 1.50 లక్షల ఇళ్లకు గృహ ప్రవేశాలు చేశామని, త్వరలో మరో లక్ష ఇళ్లకు గృహ ప్రవేశాలు చేయనున్నామన్నారు. ఈ గృహ నిర్మాణాల కార్యక్రమానికి ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడును ఆహ్వానించనున్నట్టు మంత్రి చెప్పారు. 2017-18 బిఎల్‌సి పధకంలో కేంద్ర ప్రభుత్వం 1.50 లక్షలు, రాష్ట్రం రూ.1.50లక్ష పూర్తి సబ్సిడీపై అందిస్తుందని, లబ్ధిదారుల వాటాగా రూ.25000 బ్యాంకుల్లో జమచేస్తే బ్యాంకు నుంచి రూ.75వేలు రుణం మంజూరు చేస్తారని మంత్రి తెలిపారు. స్థానిక శాసన సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు సూచనలు పరిగణలోకి తీసుకుని ఇళ్ల స్థలాలు లేనివారికి కామన్‌గా ప్రభుత్వం స్థలం కేటాయించి జి ప్లస్ 2 కేటగిరిలో గృహాల కల్పనకు యోచన చేసి పేదలకు సొంత ఇంటి కలను సాకారం చేసే దిశగా ప్రయత్నిస్తామన్నారు. గృహ నిర్మాణాలకు సంబంధించి ప్లింత్ ఏరియాను 750 చదరపు అడుగులకు పెంచడం జరిగిందన్నారు.
గత మూడు సంవత్సరాల కాలంలో 4 లక్షల గ్రామీణ ఇళ్లను నిర్మించామని, ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 2 లక్షల ఇళ్లను కట్టామని, అన్ని వర్గాలకు ఇళ్ళను నిర్మించాలన్నదే ధ్యేయమన్నారు. సమాచార పౌర సంబంధాల శాఖను మరింత పటిష్టవంతం చేయనున్నామని మంత్రి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వున్నారు.
ఏపీలో జర్నలిస్టులకు గృహనిర్మాణాలపై వారం రోజుల్లో విధాన నిర్ణయం ప్రకటన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించనున్నారని మంత్రి చెప్పారు. జర్నలిస్టుల ఇళ్ళ నిర్మాణాలకు ప్రత్యేకంగా నిధిని బడ్జెట్‌లో ప్రవేశ పెట్టాలనే అంశంపై కూడా కసరత్తు చేస్తున్నట్టు చెప్పారు. అమరావతిని, ఇతర జిల్లాలను కలిపి ఒకే విధానం అమలు చేయాలా, జిల్లాలకు ప్రత్యేకంగా చేయాలా అన్న అంశంపై కసరత్తు తుది దశకు చేరుకుందన్నారు. తొలుత జిల్లాలు, నియోజకవర్గ కేంద్రాలు, మండలాలకు సంబంధించి జర్నలిస్టుల గృహ నిర్మాణ పధకం ప్రకటించాలని భావిస్తున్నట్టు తెలిపారు. బడ్జెట్‌లో జర్నలిస్టుల ఇళ్ళ పథకానికి రూ.200 కోట్ల వరకు కేటాయించే అవకాశం ఉందన్నారు. జర్నలిస్టుల కోటాలో ఇళ్ల స్థలాలు పొందిన వారికి ప్రభుత్వం తరపున సబ్సిడీ రుణం అందించి ఇళ్లు నిర్మించుకునే అవకాశం కల్పిస్తామని, వీటిన్నింటికీ విధి విధానాలపై రూపకల్పన తుది దశకు చేరుకుందన్నారు.