రాష్ట్రీయం

హోదా కోసం కడవరకూ పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఫిబ్రవరి 10: ఊపిరి ఉన్నంత వరకూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడతామని ప్రతిపక్ష నేత, వైకాపా అధ్యక్షుడు వై ఎస్ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా శనివారం ఆయన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ పరిధిలోని బోడిగుడిపాడు గ్రామంలోని బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా వలన యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని పేర్కొన్నారు. కానీ ప్రత్యేక హోదాను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీ పెద్దలకు అమ్మేశాడని, నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతున్నాడని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో 15 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా కావాలని, తదనంతరం హోదాతో లాభం కంటే నష్టమే ఎక్కువని ఇపుడు వ్యాఖ్యానిస్తున్నాడని, ఈ రెండు నాల్కల ధోరణిని ప్రజలు గమనించాలని సూచించారు. కేసులకు భయపడిన చంద్రబాబు కేంద్రం ముందు సాగిలపడ్డాడని దుయ్యబట్టారు. విదేశాలకు ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ ఏడాదికి రూ.300-400 కోట్ల వరకూ ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు విదేశీ పర్యటనలన్నీ నల్లడబ్బు దాచుకునేందుకే అన్నారు. తన అనుకూల ప్రసార మాధ్యమాల్లో రాష్ట్రానికి బుల్లెట్ ట్రైన్, ఎయిర్‌బస్, మైక్రోసాఫ్ట్ వస్తోందని కల్లబొల్లి కబుర్లు ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. విశాఖపట్టణంలో ఏర్పాటు చేసే సమ్మిట్లలో ఒకసారి రూ.5లక్షల కోట్లని, మరోసారి రూ.10లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేస్తున్నాయంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని విమర్శించారు. కేంద్ర సంస్థ డి పి ఐ ఈ వద్ద ఐ ఈ ఎంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల డేటా ఉంటుందని, 2015 నుండి ఇప్పటివరకూ కేవలం రూ.18,900కోట్లు మాత్రమే వచ్చాయని స్పష్టం చేశారు. లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేశాయని చంద్రబాబు దారుణమైన అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. సినిమాలో చివరి వరకూ విలన్‌దే విజయమని, చివరకు హీరోదే అంతిమ విజయమని, త్వరలోనే తాము అధికారంలోకి వస్తామని జోస్యం పలికారు. రాష్ట్రంలో లక్షా2వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కనీసం 42వేల ఉద్యోగాలు చంద్రబాబు భర్తీ చేయలేదన్నారు. జాబు రావాలంటే బాబు రావాలనీ, ఉన్న ఉద్యోగం నిలబడాలంటే బాబు పోవాలని ఇపుడు ఉద్యోగులు పిలుపునిస్తున్నారని అన్నారు. ప్రతి ఏడాది ఏపీపీఎస్పీ ద్వారా పరీక్షలు నిర్వహింఙంచి ఖాళీలను భర్తీ చేస్తామని, నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని హామీనిచ్చారు. గ్రామస్థాయికి ఉద్యోగాలు తీసుకువస్తామని జగన్ స్పష్టం చేశారు. గ్రామస్థాయిలో గ్రామ సచివాలయం తీసుకువస్తామని, చదువుకున్న 10 మంది యువతకు ఉద్యోగాలు ఇస్తామని, పింఛన్, రేషన్‌కార్డు, ఆరోగ్యశ్రీ, ఫీజ్ రీయింబర్స్‌మెంట్.. ఇలా ఏదైనా దరఖాస్తు పెట్టిన 72 గంటల్లో మంజూరు చేస్తామని హామీనిచ్చారు. పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా అసెంబ్లీలో తీర్మానం చేస్తామన్నారు. బోర్లు వేస్తే ఉప్పు నీరు వస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, తన పాదయాత్రలో పలుచోట్ల ఇటువంటి సందర్భాలు ఎదురయ్యాయని తెలిపారు. కృష్టపట్నంపోర్టు వలన మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారని, జువ్వలదినె్నలో ఫిషింగ్ హార్బర్ తీసుకురావాలని వై ఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రయత్నాలు మొదలైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే జువ్వలదినె్నలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. తాము రూపొందించిన నవరత్నాల పథకాలతో ప్రజల ముఖాల్లో చిరునవ్వు రావాలనేదే తమ ధ్యేయమన్నారు. చదువు వలన తలరాతలు మారుతాయని, పిల్లలు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివిస్తానని, వారి బాధ్యత తనదేనని హామీనిచ్చారు.
కావలి నియోజకవర్గంలో జరిగిన పాదయాత్రకు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. అడుగడుగునా ప్రజలు జగన్ సంకల్పయాత్రకు నీరాజనాలు పట్టారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, వైకాపా జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.