రాష్ట్రీయం

ప్రమాదంలో ప్రజాస్వామ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 10: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, మానవ హక్కుల ఉల్లంఘన యధేచ్చగా జరుగుతున్నదని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం అఖిల భారత ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ 6 కొత్త చాప్టర్లను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే ఎన్నికలకు రూపొందించే పార్టీ ప్రణాళికలో ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ సలహాలు తీసుకుంటామన్నారు.
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రొఫెషనల్ కాంగ్రెస్ సభ్యులతో భేటీ అవుతారన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం తథ్యమంటూ, ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కె చంద్రశేఖర్‌రావు రాజ్యాంగ పదవుల్లో ఉండేందుకు అనర్హులని విమర్శించారు. సీఎల్పీ నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు కె. జానారెడ్డి ప్రసంగిస్తూ దేశ భద్రత, అభివృద్ధిలో ప్రజలు, ప్రొఫెషనల్స్ పాలు పంచుకోవాలని, దేశ అవసరాలకు అనుగుణంగా పని చేయాలని కోరారు.
ఉద్యమాలు, స్వతంత్ర పోరాటాలకు నాయకత్వం వహించింది ప్రొఫెషనల్స్ అన్నారు. ప్రస్తుత రాజకీయాలకు దూరంగా ఉండడం సరికాదని రాహుల్‌గాంధీ భావించి ప్రొఫెషనల్ కాంగ్రెస్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ప్రొఫెషనల్ కాంగ్రెస్ సౌత్ ఇండియా కో-ఆర్డినేటర్, మాజీ మంత్రి డాక్టర్ జె. గీతారెడ్డి ప్రసంగిస్తూ గుజరాత్ ఎన్నికల్లో ప్రధాని మోదీకి ముచ్చెమటలు పట్టించడంలో రాహుల్‌గాంధీతో పాటు ప్రొఫెషనల్ కాంగ్రెస్ కూడా ఉందన్నారు. తెలంగాణ ప్రొఫెషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడు దాసోజు శ్రవణ్ ప్రసంగిస్తూ స్వాతంత్య్రోదమ కాలంలో ప్రొఫెషనల్స్‌గా నెహ్రూ, సుభాష్ చంద్ర బోస్, గాంధీ లాంటి నేతలు పాల్గొన్నారని అన్నారు. దేశ రాజకీయాల్లో ప్రొఫెషనల్స్ ముందుకు వస్తే దేశ చరిత్రను మార్చవచ్చని ఆయన తెలిపారు.

చిత్రం..కాంగ్రెస్ ప్రొఫెషనల్స్ సమావేశంలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి