రాష్ట్రీయం

2019నాటికి మెట్రో పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ , నవంబర్ 29: రాష్ట్ర రాజధాని నగరంగా అభివృద్ధి చెందుతున్న విజయవాడలో 2019నాటికి అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు కార్పొరేషన్ ఎండి ఎన్ రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం నగరంలోని కౌన్సిల్ హాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులకు జరిగిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. నవ్యాంధ్ర ఏర్పాటు తరువాత అభివృద్ధిలో భాగంగా విజయవాడతోపాటు విశాఖపట్టణానికీ కేంద్ర ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టు మంజూరు చేసిందన్నారు. 2016 ఏప్రిల్‌లో మెట్రో పనులను లాంఛనంగా ప్రారంభిస్తామని తెలుపుతూ, ఇప్పటికే 6,708 కోట్ల భారీ అంచనాలతో డిపిఆర్ సిద్ధం చేశామన్నారు. నగర ప్రయాణికుల అవసరాలతోపాటు వివిధ పనుల నిమిత్తం తరలివచ్చే సందర్శకుల సౌకర్యార్థం కూడా షేర్ ఆటోకంటే తక్కువ వ్యయంతో ప్రయాణం చేయగలిగేలా మెట్రోను రూపొందిస్తున్నట్టు చెప్పారు. ఫస్ట్ ఫేజ్ కింద పండిట్ నెహ్రూ బస్టేషన్ నుంచి ఏలూరు రోడ్డు నిడమానూరు వరకూ (13.27 కి.మి), బందర్ రోడ్డు పెనమలూరు వరకూ (12.76 కి.మీ) ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. పూర్తి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన టెలీకమ్యూనికేషన్ ఆటోమెటిక్ సిస్టమ్‌తో నడిచేలా రూపకల్పన చేస్తున్నట్టు చెప్పారు. ఒకొక్క మార్గంలో 12 స్టేషన్ల కారిడార్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అజిత్‌సింగ్‌నగర్ నుంచి ఆటోనగర్ వరకూ, 5వ నెంబర్ బస్ రూట్‌లో రెండో దశ చేపట్టాల్సిందిగా సిఆర్‌డిఏ అధికారులు కోరిన నేపథ్యంలో, తగు నివేదికల రూపకల్పన చేస్తున్నట్టు చెప్పారు. అమరావతి మెట్రో ప్రాజెక్టులో ఎండీతోపాటు 9మంది సభ్యులతో కూడిన కమిటీని నియమించినట్టు, ఇందులో విఎంసి కమిషనర్ కూడా సభ్యులుగా ఉంటారన్నారు. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టే మెట్రోకు నగర ప్రజలతోపాటు ప్రజాప్రతినిధుల సహకారం ఇవ్వాలని కోరారు. తొలుత నగర పాలక సంస్థ కమిషనర్ వీరపాండియన్‌తో కలిసి మెట్రో రైల్ ప్రాజెక్టు పనులు చేపట్టే పండిట్ నెహ్రూ బస్టేషన్ పరిసరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కార్యక్రమానికి నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ అధ్యక్షత వహించగా, అమరావతి మెట్రో కార్పొరేషన్ ఎండి రామకృష్ణారెడ్డి, ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ డైరెక్టర్ శర్మ పలువురు మెట్రో ప్రాజక్టు అధికారులు పాల్గొన్నారు.

చిత్రం.. మెట్రో రైలు ప్రాజెక్టు ప్లాన్‌ను పరిశీలిస్తున్న కార్పొరేషన్ అధికారులు