రాష్ట్రీయం

శ్రీశైల మల్లన్నకు రావణవాహన సేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, ఫిబ్రవరి 10: శ్రీశైలంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామి, అమ్మవార్లకు రావణ వాహనసేవ నిర్వహించారు. ఉదయం అక్కమహాదేవి మండపంలో అందంగా అలంకరించిన స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రావణవాహనంపై ఆది దంపతులను ఆశీనులను చేయించి పూజలు నిర్వహించారు. సాయంత్రం ప్రత్యేక పూజలు, హారతి అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ మాడావీధుల్లో రావణ వాహనంపై ఊరేగిన స్వామివారిని దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు. గ్రామోత్సవం ముందు భాగంలో కళాకారులు ప్రదర్శించిన కళారూపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మహాశివరాత్రి దగ్గరపడుతుండడంతో శ్రీశైలం చేరుకునే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇరుముడులు ధరించిన శివస్వాములకు నేటితో స్పర్శదర్శనం నిలిపివేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక అమ్మవార్లకు దేవదాయ ధర్మదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రికి దేవస్థానం ఈఓ భరత్‌గుప్త, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం మంత్రి కుటుంబసభ్యులతో కలిసి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.
స్పర్శ దర్శనానికి బుకింగ్ సౌకర్యం
స్పర్శ దర్శనానికి త్వరలో బుకింగ్ సౌకర్యం కల్పిస్తామని మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. టిటిడి తరహాలో శ్రీశైలంలో సైతం ముందుగా టికెట్ బుక్ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి తెస్తామన్నారు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు నిర్ణీత సమయాల్లో స్వామివారి స్పర్శ దర్శనం చేసుకునే వీలు కలుగుతుందన్నారు. శ్రీశైలం వచ్చిన మంత్రి భ్రామరి ఉద్యానవమంలో విలేఖరులతో మాట్లాడుతూ రానున్న రోజుల్లో శ్రీశైలంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామన్నారు. క్షేత్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని మంత్రి అన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు, ప్రకాశం జిల్లా దొనకొండలో విమానాశ్రయాలు అందుబాటులోకి వస్తే శ్రీశైలం వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరుగుతుందన్నారు. క్షేత్రం చుట్టూ రూ.67 కోట్లతో చేపట్టిన ఔటర్ రింగ్‌రోడ్డు పనులు వేగవంతం చేస్తామన్నారు. అన్నదాన పథకానికి అదనంగా మరో భవనం నిర్మించామన్నారు. టూరిజంను అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యలు కల్పిస్తామన్నారు.

చిత్రం..శ్రీశైలంలో శనివారం రావణ వాహనంపై విహరిస్తున్న మల్లన్న