తెలంగాణ

చట్టసభలు జరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 11: దేశంలో చట్టసభలు జరుగుతున్న తీరు తనను తీవ్ర ఆందోళనకు గురి చేస్తుందని ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు అన్నారు. ఆదివారం పార్క్‌హయత్ హోటల్‌లో టి.సుబ్బరామిరెడ్డి లలిత కళాపరిషత్ సహాకారంతో రాగ సప్త స్వరం సంస్థ నిర్వహించిన పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్టప్రతి వెంకయ్య నాయుడు హాజరై మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యను గజమాలతో సన్మానించి, జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోశయ్య విలువలతో కూడిన రాజకీయ నాయకుడని, ఎంతో క్రమ శిక్షణతో అంచలంచలుగా ఎదిగి ముఖ్యమంత్రి, గవర్నర్ స్థాయికి ఎదిగారని అన్నారు. ప్రస్తుత రాజకీయ నాయకులకు రోశయ్య ఆదర్శప్రాయుడని కొనియాడారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో చట్టసభలు ఎంతో హుందాగా జరగాల్సి ఉండగా అందుకు భిన్నంగా సాగుతుండటం విచారకరమన్నారు. పేపర్లు చిరగకుండా, మైకులు విరగకుండా సభల్లో చర్చలు సాగడం లేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చునని అన్నారు. తాను రాజ్యసభ చైర్మన్‌గా సభలో సభ్యుల వ్యవహారశైలిని చూస్తూ కొన్ని సార్లు భావోద్వేగాలకు గురి అవుతున్నానని చెప్పారు. ఇది ప్రజాస్వామ్య స్పూర్తిని దెబ్బతీసే అంశం అని, ప్రజలు ఎన్నో ఆశలతో తమ ప్రతినిధులుగా చట్టసభలకు పంపిస్తే తాము బయటకు వచ్చి నిరసనలు చేస్తామనడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం బలంగా ఉండాలంటే స్థిరమైన ప్రభుత్వం ఎంతో అవసరమని అన్నారు. అదే సమయంలో ప్రభుత్వం చేసే తప్పిదాలను ఎత్తిచూపాలి కాని సభలనే నడవకుండా అడ్డుకుంటామనడం, ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాదానం ఇవ్వకుండా ఎదురుదాడికి దిగడం రెండూ సరికాదన్నారు. రాజకీయాల్లో క్రమశిక్షణ, పారదర్శకత ఎంతో అవసరమని, వ్యవస్థను ఆరోగ్యవంతం చేసేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయని అన్నారు. రాజకీయాల్లో శత్రువులు ఎవరు ఉండరని కేవలం ప్రత్యర్థులు మాత్రమే ఉంటారన్నారు. ప్రత్యర్థులను శత్రువులుగా భావించడం వల్ల వ్యవస్థలో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. జీవితం అంటే కేవలం రాజకీయాలే కాదని సంగీతం, కళలు ఇలా ఎనె్నన్నో ఉన్నాయని, సంపూర్ణమైన జీవితాన్ని గడపాలని సూచించారు. వేష, బాషలు వైరైనా మనంతా భారతీయులమనే స్పూర్తితో ముందుకు సాగాలని సూచించారు. నిరక్షరాస్యత, ఆకాలి, ఆర్థిక అసమానలు, వివక్ష, అరాచకాలను రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. మాతృబాష కళ్ల లాంటిదైదే, పరబాష కళ్లద్దాల వంటిదని, ప్రతి వారు తమ మాతృబాషలను ప్రేమిస్తూనే ఇతర బాషలను నేర్చుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలి, ఎంపి సుబ్బరామిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేవి. రమణాచారి, మాజీ సమాచార శాఖ కమిషనర్ విజయ్‌బాబు, నన్నపనేని రాజకుమారి, రచయిత్రి యద్దనపుడి సులోచరాణి, రాగ సప్త స్వరం నిర్వాహకురాలు రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.