రాష్ట్రీయం

15న ఇరాన్ అధ్యక్షుడు హైదరాబాద్ రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ హస్సన్ రౌహనీ ఈ నెల 15వ తేదీన హైదరాబాద్ వస్తున్నారు. ముస్లిం మేథావులు, నేతలు, ఇతర ప్రముఖులను ఉద్ధేశించి ఆయన మాట్లాడతారు. 16వ తేదీన మక్కా మసీదులో నిర్వహించే ముస్లిం ప్రజల సమ్మేళనంలో ఆయన ప్రార్ధనలు చేస్తారు. ఈ కార్యక్రమంలో భిన్నమైన ముస్లిం మత పెద్దలు పాల్గొంటారు. ఇరాన్ అధ్యక్షుడు కాకముందు హస్సన్ హైదరాబాద్ వచ్చారు. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి మరోమారు నగరానికి వస్తున్నారు. ఇస్లామిక్ చట్టాల్లో దిట్ట అయిన హస్సన్ గ్లాస్‌గో యూనివర్శిటీ నుండి న్యాయవిద్యలో పిహెచ్‌డి పొందారు. దాదాపు వందకు పైగా పుస్తకాలు రాశారు. ఈ సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడు గోల్కొండ కోటను, కుతుబ్ షాహీ సమాధిని సందర్శిస్తారు.
ఉప రాష్టప్రతికి ఘన వీడ్కోలు
రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో పర్యటించిన ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడుకు సోమవారం నాడు ఘనవీడ్కోలు లభించింది. బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి తిరిగి వెళ్లారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, ప్రోటోకాల్ అధికారులు, పోలీసు అధికారులు ఆయనకు ఘన వీడ్కోలు పలికారు.