ఆంధ్రప్రదేశ్‌

పల్లె బాట పట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) అమలులో రాష్ట్రాన్ని కేంద్రం ప్రశంసించిందని సిఎం చంద్రబాబు తెలిపారు. బుధవారం సిఎం కార్యాలయం నుంచి మంత్రులు, 13 జిల్లాల కలెక్టర్లు, జన్మభూమి కమిటీ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హుద్ హుద్ తుపానుతో దెబ్బతిన్న విశాఖ ఏడాదిన్నరకే కోలుకుని ప్లీట్ రివ్యూ లాంటి అంతర్జాతీయ వేడుకలకు ఆతిథ్యమిచ్చిందని, విశాఖ కోలుకోవటానికి అధికారులు, సిబ్బంది చిత్తశుద్ధి, దీక్ష కారణమని ప్రశంసించారు. నవ్యాంధ్ర అభివృద్ధికి అదే స్ఫూర్తి ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం సిమెంటు రహదారుల నిర్మాణంలో చరిత్ర సృష్టించబోతోందన్నారు. గ్రామీణ రహదారుల్లో 4,699 కి.మీ సిమెంట్ రోడ్ల నిర్మాణ లక్ష్యానికిగాను 4,527 కి.మీకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఇప్పటివరకు 1,490 కి.మీ పనులు చేశామన్నారు. ప్రతి పల్లెను మోడల్ విలేజ్‌గా మార్చుకునేందుకు జన్మభూమి కమిటీలు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. రాష్ట్రాన్ని కరవురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దటమే ధ్యేయమని, ఇందులో భాగంగా ప్రవేశపెట్టిన పథకమే పంట సంజీవని అంటూ పంట కుంటలకు విస్తృత ప్రాచుర్యం కల్పించాలన్నారు. యాభై వేల పంట కుంటలు పూర్తయతే వేడుక జరుపుకోవాలని, లక్ష, రెండు, మూడు, నాలుగు, ఐదు లక్షల కుంటల లక్ష్యాలు చేరుకున్న సమయంలో పెద్ద వేడుకగా చేసుకుందామన్నారు. రాష్ట్రంలో 10 లక్షల పంట కుంటలు లక్ష్యంగా పనిచేయాలని కోరారు.
వౌలిక వసతులు, సిమెంట్ రోడ్లు, సంక్షేమ కార్యక్రమాలు, కనె్వర్జెన్సీ విధానంపై వ్యక్తిగత శ్రద్ధ చూపాల్సి ఉందని సూచించారు. నరేగా కింద 8.63 లక్షల పనిదినాల లక్ష్యాలను 13 లక్షలుగా పునఃసమీక్షించి నివేదిక ఇచ్చారు. ఇందులో 10.03 లక్షలు పని దినాలు సాధించినట్లు వివరించారు. నరేగా అమలులో ప్రకాశం, కర్నూల్, అనంతపురం జిల్లాలు వెనుకబడి ఉన్నాయని, ఆ జిల్లాలు కూడా లక్ష్య సాధనకు కృషి చేయాలని ఆదేశించారు. విశాఖపట్నంలో ఐఎఫ్‌ఆర్ ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన టాయిలెట్లు ఎంతో బాగున్నాయన్నారు. ఒక్కో టాయిలెట్ ఏర్పాటుకు రూ.17,500 ఖర్చయిందని, వాటిని మన పల్లెలు, పట్టణాల్లో ఏర్పాటుకు అధ్యయనం చేయాలన్నారు.
కృష్ణాజిల్లాలో 6 వేల పనిదినాలు పెంచడం జరిగిందని, ఫిబ్రవరి చివరకు 80 వేలకు పెంచుతామని, జిల్లాలో ఇప్పటికే 149 కిమీ సిసి రోడ్ల పనులు పూర్తి చేయగలిగామని కలెక్టర్ బాబు తెలుపగా, శాఖలు మరింత సమన్వయంతో పనిచేస్తే సత్ఫలితాలు వస్తాయని ముఖ్యమంత్రి అన్నారు.
మన దేశంలో బ్రిటన్ నెలకొల్పబోయే 11 ఆస్పత్రులకు అమరావతి కేంద్రం కాబోతోందని సిఎం చెప్పారు. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీలో కృష్ణా, పశ్చిమ గోదావరి, అనంతపురం జిల్లాలు నెంబర్ వన్‌గా నిలిచాయన్నారు. ఈ-పోస్‌ను విఫలం చేయటానికి కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని, వారి ఆటలు సాగనివ్వబోమన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతి ప్రభుత్వ శాఖ సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. నీరు- చెట్టు, నదుల అనుసంధానం, కాల్వల నిర్మాణ కార్యక్రమాలను వీలయినంత త్వరగా చేసి వీలయితే అన్ని చెర్వులను నీటితో నింపేలా చర్యలు చేపట్టాలని సూచించారు. జన్మభూమి కమిటీ సభ్యులు, పెన్షనర్లను వ్యక్తిగతంగా కలిసి ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలపై చైతన్యం నింపి వారికి భరోసా కల్పించాలని కోరారు. జన్మభూమి కమిటీలు సమర్థంగా పనిచేయాలని ముఖ్యమంత్రి కోరారు. అప్పుడే వార్డులలో పనులు సవ్యంగా జరుగుతాయన్నారు. రాష్ట్రంలో గృహ నిర్మాణం అత్యంత ప్రాధాన్యం కలిగిన విషయమని, దీనిపై కలెక్టర్లందరూ సీరియస్‌గా పనిచేయాలన్నారు. సమావేశంలో ముఖ్యమంత్రి కార్యదర్శి జి.సాయి ప్రసాద్, సిఎంఓ సహాయ కార్యదర్శి ప్రద్యుమ్న పాల్గొన్నారు.

చిత్రం... మంత్రులు, జిల్లా కలెక్టర్లు, జన్మభూమి కమిటీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న సిఎం చంద్రబాబు