రాష్ట్రీయం

హోదాపై ఆగని పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఫిబ్రవరి 12: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే వరకు అలుపెరుగని పోరాటాలకు వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లాలోని కలిగిరి మండలం పెదకొండూరు గ్రామంలో ప్రజాసంకల్ప యాత్ర శిబిరంలో సోమవారం వైకాపా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో జగన్మోహన్‌రెడ్డి అత్యంత కీలక సమావేశం నిర్వహించారు. జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిణామాలు, బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయింపులు, రాష్ట్రానికి జరిగిన అన్యాయం, ప్రత్యేక హోదా తదితర కీలక అంశాలపై సమావేశంలో చర్చించామన్నారు. ఈ సమావేశంలో పార్టీ అధినేత తీసుకున్న పలు నిర్ణయాలను పాత్రికేయుల సమావేశంలో ఆయన వెల్లడించారు. మార్చి 1న అన్ని కలెక్టరేట్‌ల ముందు పార్టీ సమన్వయకర్తలు, నాయకులు, కార్యకర్తలు ధర్నాలు నిర్వహిస్తారని భూమన తెలిపారు. ప్రత్యేక హోదా మన హక్కు- ప్యాకేజీతో మోసపోవద్దనే నినాదంతో ధర్నా నిర్వహించాలన్నారు. అలాగే మార్చి 5న ప్రత్యేక హోదానే ముద్దు- ప్యాకేజీ మాకొద్దు అనే నినాదంతో దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించేందుకు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కీలక నేతలందరూ ఢిల్లీ వెళ్లేందుకు పార్టీ అధినేత జెండా ఊపి ప్రారంభిస్తారన్నారు. ప్రత్యేక హోదా సాధించే వరకు వైకాపా వెనుకడుగు వేయబోదన్నారు. గత మూడేళ్లుగా వైఎస్ జగన్ నేతృత్వంలో పోరాడుతూనే ఉన్నామన్నారు. గతంలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ధర్నా నిర్వహించి అరెస్ట్ అయ్యామని ఆయన గుర్తు చేశారు. అనేకసార్లు పార్టీ అధినేత నిరాహార దీక్షలు, యువభేరి కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేక హోదాతో ఒనగూరే ప్రయోజనాలను వివరించారన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పిలుపుతో పార్టీ రాష్టవ్య్రాప్తంగా అనేక ఆందోళనలు నిర్వహించటం జరిగిందన్నారు. ప్రత్యేక హోదా మాత్రమే రాష్ట్రానికి సంజీవి అని, ప్రత్యేక హోదాతోనే రాష్ట్భ్రావృద్ధి సాధ్యమన్నారు. అందుకోసం పార్టీ రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. దీంతో పార్టీ ప్రజలందరి మన్ననలు పొందిందని భూమన కరుణాకర్‌రెడ్డి చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదా మన హక్కు అని, ప్యాకేజీతో మోసపోవద్దని అనే నినాదాలతో పోరాటాలకు శ్రీకారం చుట్టామన్నారు. ప్రజల దీనావస్థ చూస్తూ జగన్ వారికి భరోసా కల్పిస్తూ పాదయాత్ర చేస్తున్నారన్నారు. మార్చి 3న పార్టీ నేతలందరూ జగన్ పాదయాత్రలో పాల్గొంటారన్నారు. ప్రత్యేక హోదాతో మాత్రమే రాష్ట్ర ప్రయోజనాలు సిద్ధిస్తాయన్నారు. ప్రత్యేక హోదా వద్దని ఒకరోజు, ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవనా? దానికన్నా ప్రత్యేక ప్యాకేజీ మేలని మరొకరోజు చెపుతూ చంద్రబాబు ప్రజలను మోసగించారన్నారు. ఇలాంటి చర్యలతో ప్రజాగ్రహం చూరగొన్న చంద్రబాబు ఇపుడు ప్రత్యేక హోదానే ముద్దని, ఇవ్వటం లేదనే నెపం కేంద్రంపై మోపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా సాధించే వరకు వైకాపా పోరాటం ఆపదన్నారు. ఫలితాల కోసమే ఉద్యమాలు చేస్తాం, ప్రభుత్వం చేస్తున్న మోసాలపై తిరగబడటం ప్రజాస్వామ్య లక్షణమన్నారు. పేద ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలన్న లక్ష్యం జగన్మోహన్‌రెడ్డికి ఉందన్నారు. ఎక్కడైతే శ్రీ వెంకటేశ్వరుని స్వామి పాదాల సాక్షిగా పదిహేనేళ్ల పాటు హోదా ఇస్తామని చెప్పిన జాతీయ నాయకులు ఆ అంశానికి తూట్లు పొడిచారన్నారు. హోదా దక్కని పక్షంలో తమ పార్టీ ఎంపీలు రాజీనామాలు సమర్పిస్తారన్నారు. ఈ సమావేశంలో ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, మిథున్‌రెడ్డి, వి విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యేలు మేకపాటి గౌతంరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నాయకులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో చర్చిస్తున్న వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి