రాష్ట్రీయం

శ్రీశైలానికి పోటెత్తిన భక్తజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఫిబ్రవరి 12: మహాశివరాత్రి సందర్భంగా జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. శిరిగిరిపై వెలసిన శ్రీ మల్లికార్జునస్వామి, శ్రీభ్రమరాంబికమాతలను దర్శించుకోవడానికి సోమవారం సాయంత్రం సమయానికి సుమారు రెండు లక్షల మంది భక్తులు చేరుకున్నట్లు ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. పండుగరోజు మంగళవారం మధ్యాహ్న సమయానికి భక్తుల సంఖ్య సుమారు 3.50 లక్షలకు చేరుకుంటుందని భావిస్తున్నారు. మహా శివరాత్రి సందర్భంగా స్వామి వారిని పెళ్లికుమారుడిని చేసేందుకు నిర్వహించే పాగాలంకరణ కార్యక్రమానికి ఈ ఏడాది 25 వేల మందిని అనుమతించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. గతంలో అతి కొద్ది మందికి మాత్రమే పాగాలంకరణ కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం లభించేది. ఆలయంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల కారణంగా ఈ ఏడాది పాగాలంకరణకే కాకుండా అర్ధరాత్రి సమయంలో నిర్వహించే లింగోద్భవం, కల్యాణం వేడుకలకు భక్తులు పెద్దసంఖ్యలో హాజరై ఆది దంపతుల వివాహ వేడుకను కనులారాచూసే భాగ్యం కల్పిస్తున్నారు. ఇప్పటికే శ్రీశైలంలో భక్తుల సౌకర్యార్థం ఉన్న వసతి గదులన్నీ నిండిపోగా తాత్కాలికంగా వేసిన గుడారాల్లో సైతం కాలుపెట్టడానికి వీలు లేనంత రద్దీ ఉంది. భక్తుల సొంత వాహనాలను టోల్‌గేటు నుంచి ప్రత్యేకంగా కొండపై ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలం వద్ద నిలిపేలా దారి మళ్లించారు. ఆర్టీసీ బస్టాండ్ సైతం తాత్కాలికంగా ఊరి వెలుపల ఏర్పాటు చేయడంతో అనుమతి ఉన్న వాహనాలను మాత్రమే ఆలయ పరిసర ప్రాంతాల వరకు అనుమతిస్తున్నారు.
శ్రీశైలానికి వాహనాల్లో వస్తున్న వారి కంటే కాలి నడకన వస్తున్న భక్తులే ఎక్కువగా ఉన్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఆర్టీసీ అధికారులు కర్నూలు, ఆత్మకూరు, నంద్యాల, ప్రకాశం జిల్లా మార్కాపురం, మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట, నాగర్ కర్నూలు తదితర పట్టణాల నుంచి ప్రత్యేక బస్సులు నిర్వహిస్తున్నారు. శ్రీశైలం నుంచి పాతాళగంగ వరకు ఉన్న రోప్‌వేలో ప్రయాణించాలనుకున్న వారు క్యూలైనులో 3 గంటలు వేచి ఉండాల్సి వస్తోంది. దీంతో అత్యధికులు కాలి నడకన పాతాళగంగకు వెళ్లి స్నానాలు చేస్తున్నారు. భక్తుల రద్దీ పెరుగుతుండటంతో శ్రీశైలం వీధుల్లో పారిశుద్ధ్యం చర్యలు ముమ్మరం చేశారు. భక్తులకు ఉచితంగా శుద్ధ మంచినీటిని అందించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
గజ వాహనంపై విహరించిన శ్రీశైల మల్లన్న
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీశైల మల్లన్నకు సోమవారం గజవాహన సేవ నిర్వహించారు. అందంగా అలంకరించిన ఉత్సవమూర్తులకు అలంకరణ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గజ వాహనంపై ఆశీనులను చేయించారు. హారతి అనంతరం రాత్రి గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామోత్సవం ముందుభాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. మహాశివరాత్రి సందర్భంగా మంగళవారం రాత్రి 10 గంటలకు పాగాలంకరణ జరుగుతుంది. అర్ధరాత్రి లింగోద్భవ ఘట్టం ఉంటుంది. అనంతరం తెల్లవారుజామున స్వామి, అమ్మవార్ల కల్యాణం నిర్వహిస్తారు. ఇందుకోసం దేవస్థానం ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేపట్టారు.