రాష్ట్రీయం

త్వరలో హార్వెస్టింగ్ పార్క్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: రాష్ట్రంలో ప్రతి విద్యాసంస్థ, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలని మున్సిపల్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అధికారులను ఆదేశించారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా హైదరాబాద్‌లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
ఖైరతాబాద్ జలమండలి కార్యాలయంలో సోమవారం జలమండలి, జీహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఏ, సీడీఎంఏ, టీఎస్‌ఐఐసీ అధికారులతో జలం- జీవం కార్యక్రమంపై మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వర్షపునీటిని ఒడిసి పట్టడంపై ఈ పార్క్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. ఈ పార్క్‌లో అన్ని అవసరాలకు వర్షపునీటినే వినియోగించుకోవాలని సూచించారు. జలమండలి ఆధ్వర్యంలో ఈ పార్క్‌ను ఏర్పాటు చేయాలన్నారు. మహారాష్టల్రోని లాతూర్‌లో ఎదురైన నీటి కష్టాల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని అలాంటి పరిస్థితులు భవిష్యత్‌లో హైదరాబాద్‌లో తలెత్తకుండా జలం- జీవం కార్యక్రమంలో భాగంగా ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలన్నారు. లాతూర్‌కు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసి మంచినీటిని సరఫరా చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేసారు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా హైదరాబాద్ నగరంలో మంచినీటికి ఇబ్బంది ఏర్పడకుండా ఉండేందుకు జలం-జీవం కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు మంత్రి వివరించారు. నగరంలో భూగర్భ జలాలు, మంచినీటికి ఇబ్బందులు తలెత్తకుండా చూడటమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమన్నారు. కృష్ణా, గోదావరి నదుల నుంచి నగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్నామన్నారు. రాష్టవ్య్రాప్తంగా విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల ప్రాంగణాల్లో ఇంకుడు గుంతల నిర్మాణం తప్పనిసరి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇంకుడు గుంతల నిర్మాణం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలను చైతన్యపరుచాలన్నారు. ఈ కార్యక్రమంలో సెలబ్రిటీలను భాగస్వామ్యం చేయాలని మంత్రి సూచించారు.

చిత్రం..జలం-జీవం కార్యక్రమంలో భాగంగా ఇంకుడు గుంతల నిర్మాణానికి అధికారులతో ప్రతిజ్ఞ చేయస్తున్న మంత్రి కేటీఆర్