రాష్ట్రీయం

భారత్‌తో మెరుగుపడిన సంబంథాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: భారత్‌తో ఇరాన్ సంబంధాలు మెరుగుపడ్డాయని ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ హసన్ రోహనీ పేర్కొన్నారు. మూడు రోజుల పర్యటనకు భారత్‌కు వచ్చిన రోహనీ తొలుత హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ఆయన న్యూఢిల్లీకి వెళ్తారు. శనివారం నాడు ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో, రాష్టప్రతి రామ్‌నాధ్ కోవింద్‌తో భేటీ అవుతారు. ఇరాన్ అధ్యక్షుడి వెంట క్యాబినెట్ మంత్రులు, చీఫ్ ఆఫ్ స్ట్ఫా సహా సీనియర్ అధికారులతో కూడిన 21 మంది ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా వచ్చింది. భారత్ పర్యటనలో భాగంగా బృందం అనేక ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. టెహరాన్ నుండి వచ్చిన హసన్ రోహనీ బృందానికి హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో అధికారిక లాంఛనాలతో ఘనస్వాగతం లభించింది. కేంద్ర విద్యుత్, ఇంధన మంత్రి ఆర్పీసింగ్, రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ, డిజిపి మహేందర్‌రెడ్డి, జిఎడి ముఖ్యకార్యదర్శి అదర్‌సిన్హా, ఇంటిలిజెన్స్ ఐజి నవీన్‌చంద్, నగర కమిషనర్ వివి శ్రీనివాసరావు, ప్రోటోకాల్ డైరెక్టర్ అర్వీందర్ సింగ్ ,రీజనల్ పాస్ పోర్టు ఆఫీసర్ ఇ విష్ణువర్ధనరెడ్డి తదితరులు ఇరాన్ బృందానికి స్వాగతం పలికారు. ఇరాన్ బృందానికి తాజ్‌కృష్ణలో బస ఏర్పాట్లు చేశారు.
గురువారం సాయంత్రం ఆయన ముస్లిం మత పెద్దలు, ఉలేమాలు, విద్యానిపుణులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరాన్- భారత్‌ల మధ్య పెంపొందుతున్న సంబంధాల గురించి వివరించారు. పాక్‌పై ఆధారపడకుండా ఇరాన్‌కు సముద్రయానంలో చేరుకునేందుకు వీలుగా చబహార్‌లో ఏర్పాటు చేసిన నౌకాశ్రయం అభివృద్ధికి భారత్ సహకరించడమేగాక, ఆ ఓడరేవు ద్వారా భారత్ గోదుమల ఎగుమతి చేసిన విషయాన్ని బృందం నిపుణులు ప్రస్తావించినట్టు సమాచారం. ఈ ఓడ రేవు అభివృద్ధికి భారత్ 85 మిలియన్ డాలర్లు ఆర్ధిక సాయం అందించింది.
నేడు మక్కాలో ప్రార్థనలు
17వ శతాబ్దానికి చెందిన మక్కామసీదులో శుక్రవారం జరిగే ప్రార్ధనల్లో ఇరాన్ బృందం పాల్గొంటుంది. అక్కడ సమావేశమైన ముస్లిం మతపెద్దలను ఉద్ధేశించి ఇరాన్ అధ్యక్షుడు ప్రసంగిస్తారు. అనంతరం ఇరాన్ అధ్యక్షుడు సాలార్‌జంగ్ మ్యూజియంను, గోల్కొండ ఫోర్టును, కుతుబ్ సాహీ మసీదులను సందర్శిస్తారు. శుక్రవారం రాత్రికి న్యూఢిల్లీ వెళ్తారు. శనివారం ప్రధాని నరేంద్రమోదీతోనూ, రాష్టప్రతి రామ్‌నాధ్ కోవింద్‌తోనూ ప్రాంతీయ అవగాహనపై ద్వైపాక్షిక చర్చలు జరపుతారు. ప్రధానంగా చబహార్ ఓడరేవు గుండా ఉభయ దేశాల మధ్య ఎగుమతి, దిగుమతులకు ఉన్న అవకాశాలపై కూడా చర్చలు జరపుతారు. గోదుమలు ఇతర ఆహార దినుసులను ఎగుమతి చేసి దానికి ప్రతిగా పెట్రోలియం ఉత్పత్తులను ఇరాన్ నుండి దిగుమతి చేసుకోవడంపై భారత్ దృష్టిసారించింది. అధ్యక్షుడి వెంట వచ్చిన విదేశాంగ మంత్రి మహ్మద్ జావెద్ జారిఫ్, పెట్రోలియం మంత్రి బిజాన్ జాంగేష్, వౌలిక సదుపాయాల మంత్రి అమ్బాస్ అఖుండి, గనుల మంత్రి షరియత్ మాదారి, చీఫ్ ఆఫ్ స్ట్ఫా మహ్మద్ వజీలు కూడా ఈ చర్చల్లో పాల్గొంటారు.

చిత్రం..ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ హసన్ రోహనీకి స్వాగతం చెబుతున్న గవర్నర్ నరసింహన్