రాష్ట్రీయం

నేడు పవన్‌కళ్యాణ్ మేథోమథన సభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: విభజన హామీల సాధన విషయంలో కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ తన పోరాటాన్ని ఉద్ధృతం చేస్తున్నారు. ఇప్పటికే లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ , మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆధ్వర్యంలో నిజనిర్థారణ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన పవన్ ఆ దిశగా మరో అడుగు ముందుకు వేశారు. నిజనిర్థారణ సంయుక్త కమిటీ (జెఎఫ్‌సి) తొలి భేటీని హైదరాబాద్ దసపల్లా హోటల్‌లో ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలువురు మేధావులు, విశే్లషకుల అభిప్రాయాలు సేకరిస్తూ వారితో సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్న పవన్ తాజాగా సిపిఐ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, పి మధులకు ఫోన్ చేశారు. నిజనిర్థారణ కమిటీ వివరాలను వారికి చెప్పారు. ఈ నెల 16వ తేదీన నిర్వహించే సమావేశానికి హాజరుకావాలని సూచించారు. పవన్ విజ్ఞప్తిని ఇప్పటికే రామకృష్ణ, మధులు అంగీకరించారు.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో కల్పించిన హామీల అమలుపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం , ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగు దేశం ప్రభుత్వం చేస్తున్న పరస్పర విరుద్ధ ప్రకటనల వల్ల ప్రజల్లో గందరగోళం ఏర్పడటంతో వాస్తవాలు ధృవీకరించడానికి జనసేన అధినేత ఈ భేటీ ఏర్పాటుచేస్తున్నారని పార్టీ ఉపాధ్యక్షుడు బి మహేందర్‌రెడ్డి చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు భేటీ ప్రారంభం అవుతుందని ఈ సమావేశం 17వ తేదీ కూడా కొనసాగుతుందని ఆయన వివరించారు. ఈ సమావేశానికి ప్రముఖ రాజకీయ వేత్తలు, న్యాయకోవిదులు, ఆర్ధిక శాస్తవ్రేత్తలు, విద్యావేత్తలు, సామాజిక వేత్తలు, నిపుణులతో పాటు అనేక ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతారని అన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ , లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ్, సీనియర్ పార్లమెంటేరియన్ ఉండవల్లి అరుణ్‌కుమార్, లోక్‌సభ మాజీ సభ్యుడు కొణతల రామకృష్ణ, సిపిఎం ఎపి కార్యదర్శి మధు, సిపిఐ ఎపి కార్యదర్శి రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ శాసనమండలి మాజీ సభ్యుడు గిడుగు రుద్రరాజు, పిసిసి కార్యదర్శి బి గౌతమ్, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్, ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొంటారు. 16వ తేదీ ఉదయం ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పవన్‌కళ్యాణ్ పూలమాలలు వేసి అంజలి ఘటించిన తర్వాత ఈ కార్యక్రమం మొదలవుతుంది.
నిరసన కార్యక్రమాలు
ప్రత్యేక హోదా, ఎపికి కేంద్రం చేసిన సాయం, రాష్ట్రం చేసిన ఖర్చు, ఇతర నిధుల అంశాలతో పాటు కేంద్రం నుండి రావల్సిన నిధులు, భవిష్యత్ కార్యాచరణపై భేటీలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. జెఎఫ్‌సి ఆధ్వర్యంలో మార్చి 5 నుండి పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఇరు ప్రభుత్వాలపై ఢిల్లీ స్థాయిలో ఒత్తిడి తేవాలని, అవసరమైతే ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద నిరసన కార్యక్రమాలను చేసే యోచనలో కూడా జెఎఫ్‌సి ఉన్నట్టు తెలిసింది.
లైట్ తీసుకోండి: చంద్రబాబు
పవన్‌కళ్యాణ్ ఏర్పాటు చేస్తున్న భేటీని లైట్ తీసుకోవాలని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీ వర్గాలను ఆదేశించినట్టు తెలిసింది. ఈ భేటీతో పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదని , పవన్ పోరాటంలో అర్ధం ఉందని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం ఉద్ధేశ్యం కూడా రాష్ట్రానికి మేలు జరగాలనేదే కనుక ఎవరి ఉద్యమంతోనైనా సమస్య లేదని బాబు పేర్కొన్నట్టు తెలిసింది.
యోగేంద్రయాదవ్ భేటీ
స్వరాజ్ అభియాన్ నేత , ఆమ్ ఆద్మీ మాజీ కార్యనిర్వాహక సభ్యుడు యోగేంద్ర యాదవ్ జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ను కలిశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు కూడా పవన్‌ను కలిసి చర్చించారు.