రాష్ట్రీయం

రాజీనామాలంటే రాద్ధాంతం చేస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: ప్రత్యేక హోదా సాధన కోసం తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీసుకున్న ఎంపీల రాజీనామా నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు వైకాపా ఎంపి మిథున్ రెడ్డి ప్రకటించారు. గురువారం ఆయన ఇక్కడ విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, వైకాపా ఎంపీల రాజీనామాల నిర్ణయాన్ని ప్రజలు కూడా స్వాగతిస్తున్నారని చెప్పారు. రాజీనామా చేసి ఎన్నికలు వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రత్యేక హోదా అనేది ఢిల్లీ అహంకారానికి, ఆంధ్ర ఆత్మగౌరరవానికి జరుగుతున్న పోరుగా ఆయన అభివర్ణించారు. 2019 జూన్ 4 వరకు ఎంపీలుగా కొనసాగే అర్హత ఉందని, తాము 14 నెలలు ముందే రాజీనామాలు చేస్తున్నామన్నారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామాలు చేసి ఆమోదించుకుంటామన్నారు. ఇదే సమయంలో వైకాపా నుంచి ఫిరాయించిన ముగ్గురు ఎంపీలు, 22 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని ఆయన సవాలు విసిరారు. సింగపూర్ జపాన్‌లో దిగిన ఫోటోలు తప్ప చంద్రబాబు అమరావతిలో సాధించిందేమీ లేదన్నారు. విశాఖలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సు కారణంగా రూ.15 లక్షల కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి తరలివచ్చాయని చెప్పడం బూటకమన్నారు.