రాష్ట్రీయం

టెట్ పరీక్ష యథాతథం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను యథావిధిగా ఈనెల 21 నుంచి మార్చి 3 వరకు నిర్వహిస్తామని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఇతర రాష్ట్రాల్లో సెంటర్లు కేటాయించినవారికి మార్చి 3న పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. అభ్యర్థులు ఐచ్ఛికంగా సూచించిన సెంటర్లు కాకుండా ఇతర రాష్ట్రాల్లో సెంటర్లు కేటాయించడం, హాల్ టిక్కెట్లలో తప్పులు, ఇతర అంశాలపై విద్యాశాఖ అధికారులతో తన చాంబర్‌లో గురువారం సుదీర్ఘంగా సమీక్షించారు. ఇతర రాష్ట్రాల్లో సెంటర్లు కేటాయించడంపై అధికారులపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి ఇలా ఎందుకు జరిగిందని ప్రశ్నించారు. కొన్ని జిల్లాల్లో తక్కువ పరీక్ష కేంద్రాలు, తక్కువ ఆన్‌లైన్ కంప్యూటర్ సీటింగ్ కెపాసిటీ ఉండటం వల్లే ఇలా జరిగిందని అధికారులు వివరించారు. మొత్తం 4,46,833 మంది అభ్యర్థుల్లో ఇతర రాష్ట్రాల్లో సెంటర్లను కేటాయించిన అభ్యర్థులు 15,605 (3.5శాతం) మంది ఉన్నారని వీరికి ఇప్పటికే మరోసారి
ఆప్షన్ ఇచ్చే సదుపాయం కల్పించామని అధికారులు తెలిపారు. ఇప్పటికే 9,518 (61శాతం) అభ్యర్థులు తిరిగి ఆప్షన్స్ ఇచ్చారని, మరో 6,087 మంది శుక్రవారం సాయంత్రం కల్లా ఆప్షన్ ఇచ్చినట్లయితే వారికి కూడా మన రాష్ట్రంలోనే వారి ఆప్షన్స్ ప్రకారం సెంటర్లు కేటాయిస్తామని అధికారులు తెలిపారు. ఆప్షన్స్ తిరిగి ఇచ్చిన అభ్యర్థులకు మార్చి 3న పరీక్ష నిర్వహిస్తారు. 805 మంది అభ్యర్థులకు వారు కోరిన ఆప్షన్స్ ప్రకారం కాకుండా వేరే పరీక్షా కేంద్రాలు కేటాయించగా, వీరికి కూడా తిరిగి ఆప్షన్ కోరుకునే అవకాశం ఇచ్చారు. ఇక నుంచి ఎలాంటి సమస్య రానీయకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని మంత్రి గంటా ఆదేశించారు. విద్యాశాఖ అధికారులు పూర్తిస్థాయిలో సెంటర్ల పర్యవేక్షణపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ఇంత పెద్ద సంఖ్యలో అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తుండటం ఇదే తొలిసారి.. ఇది మంచి పరిణామమని అయితే ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సెంటర్లలో పూర్తిస్థాయి వౌలిక సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని, పరీక్ష సెంటర్లలోని కంప్యూటర్లను, బ్యాకప్‌ను పరిశీలించాలని, ట్రయల్ రన్ నిర్వహించాలని స్పష్టం చేశారు. దీనిపై నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. విద్యాశాఖ అధికారులు, సంబంధిత ఏజెన్సీల సంయుక్త పర్యవేక్షణలో తనిఖీలు ఉంటాయని మంత్రి గంటా తెలిపారు. మొత్తం 4,46,833 మంది పరీక్షకు దరఖాస్తు చేసుకుంటే 3,83,204 (85.76శాతం) అభ్యర్థులు ఇప్పటివరకు హాల్‌టిక్కెట్స్ డౌన్‌లోడ్ చేసుకున్నారని తెలిపారు. మొత్తం పరీక్షా కేంద్రాలు 183 కాగా ఇందులో 159 ఏపీలోనూ, మిగతా 24 కేంద్రాలు ఇతర రాష్ట్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నామని అన్నారు. ఇందులో హైదరాబాద్ (7), బెంగళూరు (10), చెన్నై (7) ఉన్నాయన్నారు. సగటున రోజుకు 52వేల మంది టెట్ పరీక్ష రాయనున్నారని, ప్రతి సెషన్‌కు 26వేల మంది అభ్యర్థులు పరీక్ష రాస్తారని మంత్రి గంటా తెలిపారు. కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌లో ఇప్పటికే హెల్ప్ డెస్క్‌లు నిర్వహిస్తున్నామని, వీటికి అదనంగా మరో రెండు కేంద్రాలు ఏర్పాటు చేశామని, సందేహాలు ఉంటే ఫోన్ నెంబర్లు 9505619127, 9505780616, 9885604333, 9701376243లో సంప్రదించవచ్చని మంత్రి గంటా తెలిపారు.