రాష్ట్రీయం

మూసీపై ఎక్స్‌ప్రెస్ వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: మూసీ నదిపై ఎక్స్‌ప్రెస్ వేతోపాటు ఇరువైపులా రోడ్లు వేయడానికి మాస్టర్‌ప్లాన్ తయారు చేయాల్సిందిగా మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆదేశించారు. బేగంపేట క్యాంప్ కార్యాలయంలో గురువారం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కార్యక్రమాలపై అధికారులతో మంత్రి చర్చించారు. మూసీ నది అభివృద్ధి, సుందరీకరణను దృష్టిలో పెట్టుకొని మాస్టర్‌ప్లాన్‌కు రూపకల్పన చేయాలని సూచించారు. ముందుగా మూసీ నది మొత్తాన్ని సర్వే చేయాల్సి ఉంటుందని, డ్రోన్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని 40 కిలోమీటర్ల పొడువునా ఈ సర్వే చేయాలని సూచించారు. దీంతోపాటు గతంలో ఉన్న శాటిలైట్ మ్యాపులతో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అధ్యయనం జరగాల్సి ఉందని అన్నారు. నదికి ఇరువైపులా రోడ్లు నిర్మించడంతోపాటు నదిపైపై ఎక్స్‌ప్రెస్ మార్గం నిర్మించే విధంగా ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. దీనికయ్యే వ్యయంతోపాటు సాధ్యాసాధ్యాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం ఉన్న రోడ్లకు అనుబంధంగా బ్రిడ్జీల డిజైన్లు హైదరాబాద్ చారిత్రక, సంస్కృతికి అద్ధం పట్టేలా ఉండాలని, అలాగే హైదరాబాద్ నగర పరధిలోని చెరువుల అభివృద్ధికి ప్రణాళికలను రూపొందించాలని అన్నారు. అవుటర్ రింగ్ రోడ్డుకు లోపల ఉన్న చెరువుల అభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించుకుని దశలవారీగా అభివృద్ధి చేస్తామని, వర్షకాలం నాటికి కనీసం 50 చెరువులను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ఇప్పటికే 20 చెరువుల అభివృద్ధి, సుందరీకరణ ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు మంత్రికి వివరించారు. దుర్గం చెరువు సుందరీకరణ పనులు వేగవంతంగా నడుస్తున్నాయని తెలిపారు. అన్ని చెరువుల్లో గుర్రపు డెక్క తొలగించడంతోపాటు చెరువు కట్టల అభివృద్ధి పనులను ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. నగరంలో చెరువులు కబ్జాకు గురికాకుండా సంబంధిత కలక్టర్లతో చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు.

చిత్రం..మూసీ అభివృద్ధి, సుందరీకరణ మాస్టర్ ప్లాన్‌పై జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అధికారులతో సమావేశమైన మంత్రి కేటీఆర్