రాష్ట్రీయం

అంగరంగ వైభవంగా వనదుర్గాదేవి రథోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, ఫిబ్రవరి 15: ఏడుపాయల్లో జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి వనదుర్గ్భావాని అమ్మవారి రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. సుగంధ పుష్పాలతో ముస్తాబైన రథంపై ఉత్సవమూర్తి అమ్మవారిని భక్తులు కనులారా వీక్షించి తరించారు. రథోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపసభాపతి పద్మా దేవేందర్‌రెడ్డి, తెరాస రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ నగేష్ తదితరులు పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు నర్సింహాచారి ఆధ్వర్యంలో వేద బ్రాహ్మణ పండితుల ఘోషల మధ్య ప్రత్యేక పూజలు జరిగాయి. రథశాల వద్ద ఆలయ అర్చకులు రథాంగ పూజ, రథాంగ హోమాద్రి క్రతువులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. దుర్గమ్మ ఆలయంలో విశేష పూజలు, హారతి అందుకున్న ఉత్సవ మూర్తి వనదుర్గాదేవిని భారీ ఉరేగింపుతో రథశాల వద్దకు తీసుకొని వచ్చారు. ఉత్సవ మూర్తి వనదుర్గాదేవి రథంపై ఆశీసులను జయించి కొబ్బరి, గుమ్మడి కాయలు సమర్పించారు. అనంతరం భక్తుల జయజయ ధ్వానాల మధ్య రథం ముందుకు సాగింది. రథోత్సవంలో ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, జేసీ నగేష్, తెరాస రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, ఆర్డీఓ నగేష్‌లు, ఆలయ కమిటి చైర్మన్ విష్ణువర్దన్‌రెడ్డి, ఈఓ వెంకటకిషన్‌రావు, ఏఎస్పీ నాగరాజు, డీఎస్పీ వెంకటేశ్వర్లు, రూరల్ సీఐ వెంకటేశ్వర్లు, తహశీల్దార్ రాములు, సర్పంచ్ ఇందిరా నర్సింలుగౌడ్, ఎంపీటీసీ సత్యనారాయణ, స్థానిక వతంగాల్ పటేల్‌లు సాయిరెడ్డి, 18 మంది పనిబాటల వాళ్లు పతాం గోలి వద్ద రథోత్సవానికి ప్రత్యేక పూజలు నిర్వహించి లక్షలాది భక్తుల మధ్య రథోత్సవాన్ని ప్రారంభించారు. రథాన్ని లాగడానికి భక్తులు పోటీ పడ్డారు. జై వనదుర్గామాత...జైజై వనదుర్గామాత అంటూ భక్తులు పిక్కటిల్లెలా నినాదాలు చేస్తూ రథాన్ని లాగారు.