రాష్ట్రీయం

గోవధ నిషేధాన్ని అమలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: గోవధ నిషేధం అమలులో పలు రాష్ట్రాలు నిర్లక్ష్యంగా ఉంటున్నాయని, అన్ని రాష్ట్రాలూ కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను పటిష్టంగా అమలుచేయాలని కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి హన్సరాజ్ గంగారాం అహిర్ పేర్కొన్నారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో 24 రాష్ట్రాల్లో గోవధపై భిన్నమైన నియమనిబంధనలున్నాయని, అవి కూడా ఎక్కడా సక్రమంగా అమలుకావడం లేదని పేర్కొన్నారు.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో గోవుకు విశిష్టస్థానం ఉందని అన్నారు. గో పరిరక్షణపై యువతలో చైతన్యం తీసుకురావల్సి ఉందని పేర్కొన్నారు. గురువారం నాడు హైదరాబాద్ వచ్చిన ఆయన బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు.
అనంతరం ఆయన గగన్‌పహాడ్‌లోని సత్యం శివం సుందరం గో నివాసాన్ని సందర్శించారు. అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంత్ సేవాలాల్ దేశం కోసం చేసిన త్యాగాలను నేటి యువతకు బోధించాల్సిన అవసరం ఉందని, సంత్ సేవాలాల్ జీవితాన్ని పాఠ్యాంశాలుగా నేటి తరానికి అందించాలని అన్నారు. బంజారాలు, లంబాడీలు, గిరిజనులు పేరు ఏదైనా వారందరి సంస్కృతి, సంప్రదాయాలు విభిన్నమని, కొండ కోనల్లో పుట్టి పెరిగిన వారి జీవన నేపథ్యం, ఇప్పటి ఆధునిక గిరిజనుల్లో సైతం కొట్టొచ్చినట్టు కనిపిస్తుదని అంతటి గిరిజన జాతి కోసం అలుపెరుగని శ్రమ చేసిన కారణజన్ముడు సంత్ సేవాలాల్ మహారాజ్ అని అన్నారు. తన జీవితం అంతా తాను నమ్మిన అహింసా సిద్ధాంతం కోసం పాటు పడ్డారని అన్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మణ్, పేరాల చంద్రశేఖర్, ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు, చింతా సాంబమూర్తి, బిక్కునాధ్, అమర్‌సింగ్ పవార్, ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ తదితర నేతలు పాల్గొన్నారు.