రాష్ట్రీయం

డిమాండ్లు తీర్చకపోతే మరోసారి రోడ్డెక్కుతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఫిబ్రవరి 10: కాపుల సంక్షేమం కోసం తాను రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టిన డిమాండ్లలో 20 శాతం మాత్రమే సాధించుకోగలిగానని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పష్టంచేశారు. మిగిలిన 80 శాతం డిమాండ్లను రానున్న ఏడు నెలల్లో సాధించుకోవల్సి ఉందన్నారు. ఏడు నెలల తరువాత తమ డిమాండ్లు నెరవేరని పక్షంలో మరోసారి రోడ్డుకెక్కాల్సి వస్తుందని హెచ్చరించారు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కిర్లంపూడిలోని స్వగృహంలో బుధవారం ముద్రగడ విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రానున్న ఏడు నెలల కాలంలో కాపు సంక్షేమ బృందాలు ప్రతి జిల్లాలో తిరిగి కాపులలో చైతన్యాన్ని కలిగించి, స్థితిగతులను పరిశీలిస్తాయన్నారు. మంజునాథ కమిషన్ ఆయా ప్రాంతాలకు వచ్చేసరికి కాపుల సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. ఈలోగా కాపు జాతికి సంబంధించి అన్ని రకాల గణాంకాలు సిద్ధం చేస్తామన్నారు. నేను ఏదో రాజకీయ పార్టీలో చేరదామనో, పదవులు ఆశించో, ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని ఏదో లబ్ధిపొందాలనో ప్రయత్నించలేదన్నారు. పేద కాపుల ఉన్నతి కోసం, కాపు జాతి కోసం ఈ కార్యక్రమం చేపట్టానన్నారు. ‘చాలా మంది నేనేదో పదవులు, డబ్బు ఆశించి కాపుల ఐక్య గర్జన కార్యక్రమాన్ని చేపట్టానని దుష్ప్రచారం చేస్తున్నారని’ అన్నారు. తాతల నుండి తమ కుటుంబం నిజాయితీని సంపాదించుకుందని చెప్పారు. డబ్బు సంపాదించాలనుకుంటే బోలెడు ఈపాటికే సంపాదించేవాడినని, కాపు జాతిని, ఉద్యమాన్ని తాకట్టు పెట్టే అవసరం గాని, అగత్యం గాని తనకు లేవని విలేఖరులు అడిగిన ప్రశ్నలకు స్పష్టంచేశారు. ఈ విధమైన దుష్ప్రచారం చేసిన వారిని తనపై నమ్మకం ఉన్నవారెవరూ నమ్మరని స్పష్టం చేశారు. చంద్రబాబు కాపు జాతికి ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేర్చుతారన్న నమ్మకం ఉందన్నారు.