రాష్ట్రీయం

మూడువేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఫిబ్రవరి 17: మరో ఏడాదిలో మనందరి ప్రభుత్వం వస్తుందని, అన్నిపంటలకు గిట్టుబాటు కల్పిస్తామని అందుకోసం మూడువేల కోట్లరూపాయలతో ధరల స్ధిరీకరణ నిధిని ఏర్పాటుచేస్తామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 90వ రోజు శనివారం ఉదయం ఎనిమిదిగంటలకు బంగారక్కపాలెంక్రాస్ నుండి ప్రారంభమైంది. అనంతరం వలేటివారిపాలెం చేరుకుంది. పార్టీ జెండాను జగన్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా వలేటివారిపాలెంలో పొగాకు రైతులు జగన్‌ను కలిశారు. రైతులకు గిట్టుబాటు ధరకోసం తమపార్టీ పోరాటం చేస్తుందన్నారు.కిలోకు 176రూపాయలు ఉత్పత్తి వ్యయం అవుతుందని, కౌలు ఖర్చులు కూడా అదనంగా అవుతున్నాయని వారు జగన్‌కు వివరించారు. కనీసం గిట్టుబాటు ధర కేజి 210 రూపాయలు ఉండాలని రైతులు జగన్‌కు వివరించారు. అన్నిపంటలకు మనందరి ప్రభుత్వం వచ్చిన వెంటనే గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. దీంతో రైతులు హర్షంవ్యక్తం చేశారు. కాగా రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించే వరకు పోరాడాలని జిల్లా కోర్టు న్యాయవాదులు జగన్‌కు సూచించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేకహోదా కావాలనికోరుతూ ఉద్యమాన్ని ఇంకా ఉద్ధృతం చేస్తానని హామీ ఇచ్చారు. తమను ఎస్‌టి జాబితాలో చేర్చాలని మత్స్యకార ప్రతినిధులు జగన్‌కు వినతిపత్రం సమర్పించారు. అన్ని రంగాల్లో తాము వెనుకబడి ఉన్నామని,రోజురోజుకు దిగజారిపోతున్నామని, ఎలాగైనా ఆదుకోవాలని జగన్‌కు మత్స్యకారులు సూచించారు. పార్టీ అధికారం చేపడితే తప్పనిసరిగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. జగన్ హామీ ఇచ్చారు. ఇదిలాఉండగా కునివానిపాలెంక్రాస్,పోకూరు మీదుగా కొనసాగినపాదయాత్ర 90రోజున అక్కడే ముగిసింది.
ఇదిలాఉండగా జిల్లాలో 90వరోజు సాగిన జగన్‌పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరధం పట్టారు. ఈ పాదయాత్రలో అందరితో మమేకం అయి వారి సమస్యలను సవధానంగా వినటమేకాకుండా వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తానని జగన్ హామీలు ఇవ్వటంతో అన్నివర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేసవి రాకముందే ఎండలు మండుతున్నప్పటికీ ఎండలను సైతం లెక్కచేయకుండా జనవాహిని భారీగా తరలివచ్చింది. ఈ పాదయాత్రలో వైకాపా ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు, నెల్లూరు పార్లమెంటుసభ్యులు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కందుకూరునియోజకవర్గ ఇన్‌చార్జీ తూమాటి మాధవరావు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..ప్రజాసంకల్పయాత్రలో శనివారం ప్రకాశం జిల్లాలో రైతులు తెచ్చిన
పొగాకు మండెను పరిశీలిస్తున్న వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి