రాష్ట్రీయం

ఎస్సీ, ఎస్టీల నిధులు మళ్లిస్తే కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 10: ఎస్‌సి, ఎస్‌టి ఉపప్రణాళికా నిధులను దారిమళ్లిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులకు సాంఘిక సంక్షేమ మంత్రి రావెల కిషోర్‌బాబు హెచ్చరించారు. 31 శాఖల ముఖ్యకార్యదర్శులు, శాఖాధిపతులతో బుధవారం ఆయన సచివాలయంలో నోడల్ ఏజెన్సీ సమావేశం నిర్వహించారు. ఉపప్రణాళిక ద్వారా లభిస్తున్న నిధులను కేవలం ఎస్‌సి, ఎస్‌టిల అభివృద్ధి కోసమే వినియోగించాలన్నారు. ఎంత మంది ఈ ఉపప్రణాళిక నిధుల వల్ల లబ్దిపొందారో, ఏ ఏ కార్యక్రమాలకు నిధులు వ్యయం చేశారో అందరికీ తెలిసేలా అన్ని వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టాలని ఆదేశించారు. ఎస్‌సి ఉపప్రణాళిక నిధులతో గుంటూరు, విశాఖ, తిరుపతిల ఆదర్శ ఐటిఐలను ఏర్పాటు చేయాలని సూచించారు.

గుణదలలో సెల్ టవర్ ఎక్కి
బిటెక్ పట్ట్భద్రుడి హల్‌చల్
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఫిబ్రవరి 10: అగ్రవర్ణ పేద విద్యార్థులను ఆదుకునే వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూలోక్ సత్తా పార్టీ అర్బన్ సంయుక్త కార్యదర్శి ఉప్పులూరి రవితేజ బుధవారం గుణదలలోని సెల్ టవర్ ఎక్కి హల్‌చల్ సృష్టించారు. కమ్మ సమాజిక వర్గానికి చెందిన బిటెక్ పట్ట్భద్రుడైన రవితేజను క్షేమంగా కిందకు దించేందుకు నాయకులు, పోలీస్ అధికారులు నానా హైరానా పడాల్సి వచ్చింది. రవితేజ గత మున్సిపల్ ఎన్నికల్లో లోక్‌సత్తా తరఫున మధురానగర్ నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేశారు. కులాలు, మతాల ఆధారమైన రిజర్వేషన్లను తక్షణం నిలిపివేసి పేదరికం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలని కేకలు వేస్తూ పలువురు చూస్తుండగానే టవర్ ఎక్కి కూర్చున్నారు. స్థానికులు అందించిన సమాచారంపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు ముమ్మనేని ప్రసాద్, మాచవరం పోలీసు అధికారులు, పెద్ద సంఖ్యలో యువకులు అక్కడికి చేరుకుని అతడిని కిందకు దించేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు జరిగాయి. రవితేజ తన వెంట తెచ్చుకున్న డిమాండ్ కాగితాలను కిందకు విసిరాడు. కులం, మతంతో నిమిత్తం లేకుండా పేద కుటుంబాలకు పలు రకాల ప్రవేశ పరీక్షల్లో 10 శాతం బోనస్ మార్కులు కల్పించాలని, ఉన్నత హోదాలో ఉన్న వారు, సంపన్న వర్గాల కుటుంబాలకు తక్షణమే రిజర్వేషన్లను రద్దు చేయాలంటూ తమ డిమాండ్ చేశారు. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లగలమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పడంతో రవితేజ కిందికి దిగివచ్చాడు.
ఇద్దరు నకిలీ పోలీసులు అరెస్టు
ఆంధ్రభూమి బ్యూరో
చిత్తూరు, ఫిబ్రవరి 10: పోలీస్ దుస్తులతో బలవంతపు వసూళ్లకు పాల్పడడంతో పాటు ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న నకిలీ పోలీస్‌లను చిత్తూరు రూరల్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఒక సుమోతో పాటు ఐదు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. సీఐ ఆదినారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గుడిపాల మండలం పల్లూరుకు చెందిన బాలు తమిళనాడులోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు. అక్కడ అక్రమాలకు పాల్పడడంతో అతనిని విధుల నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో వేలూరులో పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సంతోష్‌ను ఆ ప్రభుత్వం విధుల నుంచి శాశ్వతంగా తొలగించింది. వీరిద్దరికి అక్కడ పరిచయం ఏర్పడింది. అనంతరం పెనుమూరుకు చెందిన నరేష్‌ను, వేలూరుకు చెందిన సెల్వంలను కలుపుకొని గత కొంత కాలంగా ఈ నలుగురు పోలీస్ దుస్తులతో రోడ్డుపై వెళ్లే వాహనాలను అడ్డుకొని మామూళ్లు వసూలు చేయడంతో పాటు ఎర్రచందనం కూడా అక్రమంగా రవాణా చేసేవారు. ఈ క్రమంలో పోలీస్ తనిఖీల్లో భాగంగా గుడిపాల మండలం గొల్లమడుగు వద్ద వీరు టాటాసుమోలో వెళ్తుండగా పోలీస్‌లు అటకాయించారు.
కులాల మధ్య చిచ్చుపెట్టొద్దు: పనబాక
నెల్లూరుసిటీ, ఫిబ్రవరి 10: రాజకీయాల కోసం కులలా మధ్య చిచ్చు పెట్టడం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మానుకోవాలని మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ సూచించారు. బుధవారం నెల్లూరు నగరంలోని ఒక హోటల్లో ఆమె విలేఖరులతో మాట్లాడారు. ఏ కులాన్ని కూడా చిన్న చూపు చూసి మాట్లాడ కూడదని, ఏ కులం వారికి ఆకులం గొప్పదని ఆయన గుర్తించుకోవాలన్నారు. టిడిపి హయంలో ఒక వర్గానికే న్యాయం జరిగే విధంగా ఉందన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినట్లుగా వాగ్దానాలను అమలు చేయకపోగా, రైతుల గురించి ఒక సమావేశంలో వ్యంగ్యంగా మాట్లాడం చాలా బాధకరంగా ఉందన్నారు. ఈ ఏడాది రైల్వే బడ్జెట్‌లో ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రత్యేక హోదాపై చట్టసభల్లో చేసిన చట్టం చెల్లదని చెప్పడంపై అప్పటి ప్రధాన మంత్రిని అవమాన పరచడమే అన్నారు. త్వరలో పెట్టనున్న రైల్వే బడ్జెట్‌లో నెల్లూరు జిల్లాకు సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులకు నిధులకు కేటాయించాలన్నారు.
రీసెర్చ్‌స్కాలర్ ఆత్మహత్యాయత్నం?
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 10: ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధక విద్యార్థి పి.శిరీష బుధవారం ఎయు ప్రాంగణంలో స్పృహతప్పి పడిపోవడంతో ఆమెను కెజిహెచ్‌కు తరలించారు. అయితే ఈమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని కొందరు, అనారోగ్య కారణాలతో నిద్రమాత్రలు వేసుకుందని మరికొందరు చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు గ్రామానికి చెందిన శిరీష 2013లో జూవాలజీ విభాగంలో పరిశోధక విద్యార్థిగా చేరింది. ఇదిలా ఉండగా గత ఏడాది ఆమె రాజీవ్‌గాంధీ ఫెలోషిప్‌కు ఎంపికైంది. దీంతో ఆమెకు నెలకు రూ.20వేలు నిరుద్యోగభృతి లభించింది. అయితే ఈ ఫెలోషిప్‌కు ఎంపికైన విద్యార్థులు కొత్త ప్రాజెక్టును చేపట్టాల్సి ఉంది. ఆ మేరకు ఆమె తనకు గతంలో ఇచ్చిన టాపిక్‌ను, గైడ్‌ను మార్చాలని సంబంధిత విభాగాధిపతులపై వత్తిడి తెచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆమె నిద్ర మాత్రలు వేసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడిందని కొందరు చెబుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని కెజిహెచ్ వైద్యులు బుధవారం సాయంత్రం తెలిపారు.
నీటికుంటలో ఇద్దరు చిన్నారుల మునక
సంతమాగులూరు, ఫిబ్రవరి 10 : ప్రమాదవశాత్తు నీటికుంటలో పడి ఇరువురు అక్కా చెల్లెళ్ళు మృతి చెందిన సంఘటన ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు శివారు గ్రామం రామిరెడ్డిపాలెం వద్ద బుధవారం సాయంత్రం జరిగింది. గ్రామంలో కూలీ పనులు చేసుకునే రామారావు, అంకమ్మ దంపతులకు ఇరువురు కుమార్తెలు. దంపతులు కూలీ పనులకు వెళ్తూ పిల్లల్ని అంగన్‌వాడీకేంద్రంలో వదలి వెళ్తున్నారు. ఎప్పటిలాగే బుధవారం కూడా అంగన్‌వాడీకేంద్రంలో అశ్వని(9), ప్రమీల (6)ను అంగన్‌వాడీ కేంద్రం వద్ద విడిచి తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లారు. పిల్లలిద్దరూ మధ్యాహ్నం మూడుగంటల ప్రాంతంలో ఇంటికి వచ్చి బహిర్భూమికని ఇంటివెనుక ఉన్న కుంట వద్దకు వెళ్లారు. అక్కడ ప్రమాదవశాత్తూ కాలు జారి అందులో పడి మృతి చెందారు. సాయంత్రం పిల్లలకోసం వెదుకుతూ కుంటలో చూడగా అక్కడ అక్కచెళ్లెల్లిద్దరూ శవాలై కన్పించడంతో బోరుమన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు.
రూ. 5 కోట్ల ఎర్రచందనం పట్టివేత
రైల్వేకోడూరు, ఫిబ్రవరి 10: కడప జిల్లా రైల్వేకోడూరు మండలం ఎస్.ఉప్పరపల్లె పంచాయితీ పరిధిలోని వాగేటికోన సమీపంలో బుధవారం రూ. 5 కోట్ల విలువ చేసే ఎర్రచందనం దుంగలను పట్టుకున్నట్లు తిరుపతి డిఎఫ్‌ఓ సుబ్బారెడ్డి తెలిపారు. బుధవారం బాలుపల్లె చెక్‌పోస్టు, శేషాచలం అడవుల్లో జరుగుతున్న కూంబింగ్‌ను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు బాలుపల్లె అటవీఅధికారి శ్రీనివాసులరెడ్డి, డిఆర్వో పిచ్చయ్య, యల్లప్ప, స్ట్రైక్లింగ్ ఫోర్స్, సిబ్బంది కూంబింగ్ నిర్వహిస్తుండగా ఒక కంటైనర్‌లో తరలించేందుకు సిద్ధంగా ఉన్న 200 ఎర్రచందనం దుంగలు లభించాయన్నారు. సిబ్బందిని చూసి కూలీలు, స్మగ్లర్లు అడవిలోకి పారిపోయారన్నారు. ఎర్రచందనం దుంగలు, కంటైనర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. బాలుపల్లె అటవీ పరిధిలోని శేషాచలం అడవుల్లో ఎర్రచందనం కూలీలు, స్మగ్లర్లు ఉన్నారన్న సమాచారంతో అటవీ సిబ్బంది, ప్రత్యేక పోలీస్ బలగాలు విస్తృతంగా గాలింపుచర్యలు చేపడుతున్నట్లు డిఎఫ్‌ఓ సుబ్బారెడ్డి తెలిపారు.

తల్లి, ఇద్దరు బిడ్డల ఆత్మహత్య
గంట్యాడ, ఫిబ్రవరి 10: కుటుంబ కలహాల కారణంగా జీవితంపై విరక్తి చెంది తన ఇద్దరు కుమారులు సహా తల్లి ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలో బుధవారం చోటు చేసుకుంది. గంట్యాడ మండలం రామవరంలో బుధవారం సాయంత్రం ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. కలిదిండి కృష్ణంరాజు, అతని భార్య సరస్వతి, ఇద్దరు కుమారులతో కలిపి రామవరంలో నివాసం ఉంటున్నారు. కృష్ణంరాజు, సరస్వతి మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న కృష్ణంరాజు బుధవారం ఉదయం డ్యూటీకి వెళ్లాడు. అయితే సాయంత్రమైనా సరస్వతి, ఆమె కుమారులు ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు కిటికిలోంచి చూడగా ఆ ముగ్గురూ మృతదేహాలై ఫ్యానుకు వేలాడుతూ కనిపించాయి. పోలీసులకు సమాచారం అందించారు. పిల్లల్లో సాయివర్మ (13) ఎనిమదవ తరగతి విద్యార్థి, హర్షవర్ధన్ (10) ఐదవ తరగతి చదువుతున్నారు. డిఎస్పీ కృష్ణప్రసన్న, విజయనగరం రూరల్ సిఐ రవికుమార్, గంట్యాడ ఎస్సై మూర్తి సంఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. అయితే తన కుమార్తె భర్త వేధింపుల కారణంగానే పిల్లలు సహా ఉరిపోసుకుని మృతి చెందిందని సరస్వతి తల్లి రమ ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని మృతురాలి బావ కృష్ణమూర్తి, అక్కలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల భార్యతో గొడవ పడిన మాట వాస్తవమేనని ఇంట్లోనే ఉన్న తను, భార్య, పిల్లలు ఆనందంగానే ఉన్నామని మృతురాలి భర్త కృష్ణంరాజు పోలీసులకు తెలిపాడు.

బాసర క్షేత్రానికి వసంత శోభ
బాసర, ఫిబ్రవరి 10: ఆదిలాబాద్ జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞానసరస్వతి దేవి నిల యం వసంత శోభను సంతరించుకుంది. మాఘశుద్ధ తృతీయ గురువారం నుండి మూడు రోజులపాటు వసంతపంచ మి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.