బిజినెస్

దేశంలోనే తొలి మొబైల్ కేన్సర్ ఆసుపత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 17: రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహన్ చొరవతో దేశంలోనే తొలిసారిగా అత్యాధునిక సాంకేతిక పరికరాలతో ఉచిత వైద్యం రూపుదాల్చింది. ఎంపీ మాగంటి మురళీమోహన్ ఎంపీ నిధులు రూ.1.30 కోట్లతోనూ, రూ.70 లక్షల నిధులతో డాక్టర్ గన్ని భాస్కరరావు ఆధ్వర్యంలో జిఎస్‌ఎల్ ట్రస్ట్ సంస్థ సుమారు రూ. 2 కోట్ల నిధులతో అత్యాధునిక మొబైల్ కేన్సర్ ఆస్పత్రిని అందుబాటులోకి తెస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో ప్రజలకు కేన్సర్‌కు సంబంధించి ఉచితంగా అత్యాధునిక వైద్యం ఆవిష్కృతమైంది. త్వరలో జిఎస్‌ఎల్ సంస్థ రూ. 2 కోట్లతో మరో మొబైల్ ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ క్రమంలో రెండు మొబైల్ అత్యాధునిక సంచార వైద్యశాలలు ఉభయ గోదావరి జిల్లాల్లో సేవలు అందించనున్నాయి. ఇందుకు సంబంధించి ఒప్పంద పత్రాలపై ఎంపీ మాగంటి మురళీమోహన్, జిఎస్‌ఎల్ ట్రస్ట్ గన్ని కాశింబి శనివారం ఆర్ అండ్ బిలో సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాగంటి మురళీమోహన్ మీడియాతో మాట్లాడుతూ దేశంలోనే మొదటి సారిగా కేన్సర్‌కు హాస్పిటల్ ఆన్ వీల్స్ మొబైల్ క్లినిక్ ఆన్ వీల్స్‌ను పీపీపీ విధానంలో ఉభయ గోదావరి జిల్లాల్లో సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఈ మొబైల్ కేన్సర్ వాహనంలో సేవలు, వైద్యుల వివరాలు, వైద్య పరీక్షలు నిర్వహించి క్షణాల్లో రిపోర్టు తీసుకుని అక్కడికక్కడే నిపుణుల ద్వారా వైద్యాన్ని తెలుసుకుని అక్కడికక్కడే ప్రజలకు వైద్యం అందిస్తారని జిఎస్‌ఎల్ వ్యవస్థాపక వైద్య నిపుణులు డాక్టర్ గన్ని భాస్కరరావు వివరించారు. త్వరలో జిఎస్‌ఎల్ ఆస్పత్రి యాజమాన్యం ప్రత్యేకించి రూ. 2కోట్లతో మరో వాహనాన్ని కన్ను, చెవి, ముక్కు, పంటి వైద్యానికి సంబంధించి నిర్వహించనుందని ఎంపీ మాగంటి మురళీమోహన్ చెప్పారు. కేన్సర్‌ను ముందుగానే గుర్తించి తగిన వైద్యాన్ని అందిస్తే ఎందరి ప్రాణాలనో కాపాడవచ్చన్నారు. ఇటీవల కాలంలో మహిళలకు అత్యధికంగా బ్రస్ట్ కేన్సర్ పొడచూపుతోందని, ముందుగానే ఈ కేన్సర్‌ను ఈ అత్యాధునిక మొబైల్ ఆస్పత్రిలో గుర్తించి వైద్య పరీక్షలు చేసి వైద్యాన్ని ఉచితంగా అందిస్తారన్నారు దేశంలోనే మొదటి సారిగా ఈ కేన్సర్ స్క్రీనింగ్ డిజిటల్ వెహికల్‌ను ఏర్పాటు చేశామన్నారు. భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో రోజు రోజుకీ కేన్సర్ పెరుగుతోందన్నారు.
ముఖ్యంగా మహిళల్లో వచ్చే బ్రస్ట్ కేన్సర్‌కును అత్యాధునిక వైద్యం ద్వారా నయం చేయవచ్చన్నారు. కేన్సర్ సోకకుండా ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. అత్యాధునిక విధానంలో కేన్సర్ వైద్యాన్ని ప్రజల ముంగిటకే తీసుకెళ్తున్నామన్నారు. ఈ మొబైల్ వాహనంలో అత్యాధునిక వైద్య పరీక్షలు నిర్వహిస్తారన్నారు. కొయంబత్తూరులో ఈ వాహనాన్ని రూపొందించడం జరిగిందని చెప్పారు. ఏప్రిల్ 10వ తేదీ నాటికి వాహనం ప్రజా సేవకు ఆవిష్కృతమవుతుందని చెప్పారు. ఈ వాహనాలకు థర్డ్‌పార్టీగా ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు ఉంటారన్నారు. ఏప్రిల్ 10వ తేదీ నాటికి రెండు మొబైల్ వాహనాల్లో అత్యాధునిక కేన్సర్ వైద్యం ప్రజలకు అందుబాటులోకి రానుందన్నారు. సమావేశంలో డాక్టర్ గన్ని భాస్కరరావు, గన్ని కాశింబి, వాహనం ఇన్‌చార్జి పార్ధసారధి తదితరులు పాల్గొన్నారు.