రాష్ట్రీయం

‘జీఎస్టీ’ నేను తీయలేదు..కానె్సప్టే నాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 17: ఇటీవల ఇంటర్నెట్‌లో ప్రసారమైన లఘు చిత్రం గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ (జిఎస్టీ)ని తాను నిర్మించలేదని, ఆ చిత్రానికి సంబంధించిన కాన్సప్ట్ మాత్రమే తనదని వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అన్నారు. ఓ అమెరికా నిర్మాణ సంస్థ ఆ చిత్రాన్ని తీసిందని, తనకేమీ సంబంధం లేదని స్పష్టం చేశారు. విదేశీ పోర్న్‌స్టార్ మాల్కోవా నటించిన జిఎస్టీపై ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వర్మ తీస్తున్నట్లు ప్రచారం జరగడంతో మరింత చర్చకు దారితీసింది. ఈ వివాదాస్పద చిత్ర ప్రదర్శన నిలిపివేయాలని సిసిఎస్‌లో దాఖలైన కేసుతో పాటు మహిళా సామాజిక కార్యకర్త దేవి పట్ల ఓ టివి చర్చాగోష్టిలో వర్మ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమె దాఖలు చేసిన కేసులోనూ సిసిఎస్ పోలీసులు నోటీసులు జారీ విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ మేరకు శనివారం సిసిఎస్ సైబర్‌క్రైం పోలీసుల ముందు విచారణకు హాజరై తనపై వచ్చిన అభియోగాలకు వివరణ ఇచ్చారు. సిసిఎస్ సైబర్ క్రైం అదనపు డీసీపీ రఘువీర్ సుమారు 3 నుంచి 4 గంటల పాటు వర్మను విచారించారు. ఈ సందర్భంగా వర్మకు సైబర్ క్రైం అధికారులు పలు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. జీఎస్టీని ఎందుకు తీశారు..?, విదేశాల్లో నిర్మించినంతమాత్రానే భారతీయ చట్టాలకు ఈ సినిమా వర్తించదని ఎలా చెబుతారు..?, జీఎస్టీని ఎంతకు విక్రయించారు..?, ఆ చిత్రంలో నటించిన మాల్కోవా ఫోటోలు మీ ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన మాల్కోవా ఫోటోలు ఎక్కడివి..? టివి చర్చా గోష్ఠిలో సామాజిక కార్యకర్త దేవి పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు ఎందుకు చేశారు..?, ఆమెతో పోర్స్ సినిమా తీస్తానన్నారా..? లేదా.?, మాల్కోవాతో అభ్యంతర సన్నివేశాలు ఎలా తీశారు..?? వంటి ప్రశ్నలను వేసినట్లు తెలుస్తోంది. దాదాపు మూడున్నర గంటల విచారణ అనంతరం వర్మ బయటకు వచ్చారు. తాను జీఎస్టీ తీయలేదని, కేవలం తన వద్ద ఉన్న కానె్సప్ట్‌ను మాత్రమే వారికి ఇచ్చానని చెప్పినట్లు తెలిపారు. తనకు ఈ చిత్రం నిర్మించినందుకు ఎలాంటి డబ్బు అందలేదని, అందుకు ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు. తాను భారతీయ చట్టాలను ఉల్లంఘించలేదని వివరణ ఇచ్చారు. సిసిఎస్ పోలీసులు వివిధ కోణాల్లో ప్రశ్నించారని, వాటన్నింటికి సమాధానం చెప్పానని తెలిపారు. ఈ సందర్నంగా సైబర్ క్రైం అదనపు డిసిపి రఘువీర్ విలేకరులతో మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించిన చాలా కీలక సాంకేతిక ఆధారాలు సేకరించాల్సి ఉందని అన్నారు. ఇది సాధారణ నేరం కింద విచారణ చేస్తే సరిపోదని, చాలా సాంకేతిక అంశాలు ముడిపడి ఉన్నందున విభిన్న కోణాల్లో, లోతుగా విచారణ చేపట్టాల్సి ఉందని అన్నారు. సత్యమేవ జయతేను ‘సత్య మియా జయతే’ అంటూ వర్మ ట్వీట్ చేసిన అంశాన్ని కూడా ఈ కేసులోనే చేరుస్తామని ఆయన తెలిపారు. నగ్నంగా ఉన్న మాల్కోవాతో వర్మ ఉన్న ఫోటోలను ఆయన ఫోన్, ల్యాప్‌ట్యాప్ నుంచి డౌన్‌లోడ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపుతామని, ఆ నివేదిక రాగానే అందుకు తగిన ప్రశ్నలను తదుపరి విచారణలో అడుగుతామని చెప్పారు. సినిమా ఎక్కడ తీసినా చట్టం తన పని తాను చేసుకుపోతుందని, విదేశాల్లో నిర్మించినంత మాత్రాన చట్టం నుంచి తప్పించుకోలేరని తెలిపారు. ఆ చిత్రం అశ్లీల చిత్రం కాదని, ఒక ఆర్ట్ ఫిల్మ్ అని వర్మ చెబుతున్నారని, అది ఎలాంటి చిత్రమో విచారణలో తాము నిర్ధారిస్తామని అదనపు డిసిపి వెల్లడించారు. ప్రస్తుతానికి వర్మను అరెస్టు చేయడం లేదని, మరిన్ని స్పష్టమైన ఆధారాలు లభించాక చర్యలు ఉంటాయని తెలిపారు. ఒక వేళ దోషి అని తేలితే రెండు నుంచి ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పారు. అయితే విచారణకు వర్మ సహకరించారని, తదుపరి విచారణకు మరోసారి హాజరు కావాలని చెప్పినట్లు తెలిపారు. కానీ మరో నోటీసు జారీ చేయలేదని, ఆయన ల్యాబ్‌ట్యాప్, మొబైల్ స్వాధీనం చేసుకున్నామని అన్నారు.

చిత్రం..గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ అనే లఘు చిత్రంపై
కేసు విచారణకు హాజరైన దర్శకుడు రాంగోపాల్ వర్మ