రాష్ట్రీయం

మత్స్యావతారునిగా యాదాద్రి నారసింహుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఫిబ్రవరి 19: యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల్లో సోమవారం విశేషాలంకార, వాహన సేవలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. దశవతారాల్లో వేద రక్షకుడిగా శ్రీ మహావిష్ణువు దాల్చిన తొలి అవతారమైన మత్స్యావతార మూర్తిగా దర్శనమిచ్చిన లక్ష్మినరసింహుడు రాత్రి శేష వాహనంపై విహరించారు. శేషశయనుడైన శ్రీ మహావిష్ణువు లక్ష్మినరసింహుడి రూపంలో పెండ్లికొడుకుగా ముస్తాబై ఆదిశేషరూఢుడై తీర్ధజనులకు దర్శనమివ్వగా దర్శించుకున్న భక్తులు తన్మయులయ్యారు. లక్ష్మినరసింహుడికి ఆరు రోజుల పాటు వరుసగా శ్రీకృష్ణాలంకార సేవ, హంసవాసన సేవ, వటపత్రశాయి సేవ, పొన్నవాహన సేవ, గోవర్ధనగిరిధారి సేవ, సింహవాహన సేవ, జగన్మోహినీ సేవ, అశ్వవాహన సేవ, శ్రీరామలంకార సేవ, హనుమత్ వాహన సేవ, గజ వాహన సేవ, శ్రీ మహావిష్ణువు సేవ, గరుడ వాహన సేవలు నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా వేద పారాయణలు, హోమ, హవనాలు శాస్తయ్రుక్తంగా కొనసాగాయి. ఉత్సవాల్లో ఆలయ ఈవో గీత, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, టీడీపీ తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు వంటేరు ప్రతాప్‌రెడ్డి దంపతులు పాల్గొని స్వామిని సేవించారు. మంగళవారం లక్ష్మీనారసింహుడికి ఉదయం శ్రీమురళీకృష్ణాలంకార సేవ, రాత్రి హంసవాహన సేవలు నిర్వహించనున్నారు. స్వామివారి కల్యాణోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానిస్తు ఈవో గీత, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి సోమవారం ప్రగతి భవన్‌కు వెళ్లి ఆహ్వానపత్రికను అందించారు.