రాష్ట్రీయం

కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో స్వల్ప అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, ఫిబ్రవరి 19: కాకినాడ ప్రభుత్వాసుపత్రి మాతాశిశు విభాగం భవనం పైభాగంలో ఉన్న ఎన్‌ఐసియు విభాగంలో సోమవారం రాత్రి స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పసి బిడ్డలకు ప్రాణవాయువు సరఫరాచే సే సీపేప్ మెషిన్ అగ్నికి ఆహుతయింది. ఈ ప్రమాదంతో వార్డులో తల్లులు తమ పసిబిడ్డలను తీసుకుని పరుగులు తీశారు. అయితే ఎవరికీ ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదని తెలుసుకున్న వారు ఊపిరి పీల్చుకుని తిరిగి వార్డులోకి చేరుకున్నారు. పసిబిడ్డలకు ఆక్సిజన్‌ను సరఫరా చేసే సీపేప్ మెషిన్‌లో నుండి మంటలు వెలువడగా ఆ సమయంలో విధినిర్వహణలో ఉన్న వైద్యులు వెంటనే అప్రమత్తమై మెషిన్‌కు ఉన్న విద్యుత్ సరఫరాను నిలిపివేసి, అక్కడ ఉన్న ఫైర్ సేఫ్టీ పరికరాలతో మంటలు ఆర్పివేశారు. అనంతరం వారు ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేయడంతో వారు హుటాహుటిన సంఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలు వ్యాప్తిచెందకుండా చర్యలు తీసుకున్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం రాఘవేంద్రరావు తెలిపారు. వైద్యులు సకాలంలో స్పందించడంతో పసిబిడ్డలకు ఎటువంటి ప్రాణహాని జరగలేదన్నారు. ఆస్తినష్టం జరగలేదని స్పష్టం చేశారు. గత రెండు నెలల కాలంలో ప్రభుత్వాసుపత్రిలో జరిగిన మూడవ అగ్ని ప్రమాదం ఘటన కావడంతో ఆసుపత్రిలో తీవ్ర అలజడి నెలకొంది.

చిత్రం..అగ్నిప్రమాదంలో కాలిపోయిన సీపేప్ మెషిన్