తెలంగాణ

పార్క్‌లే పార్కులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 21: నాలుగు కొత్త ఇండస్ట్రియల్ పార్క్‌లతోపాటు రెండు ఐటీ పార్క్‌లను టౌన్ షిప్‌లుగా నోటిఫై చేస్తూ మున్సిపల్ పరిపాలనా శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ టౌన్ షిప్‌లు ఇకనుంచి ప్రత్యేక స్థానిక సంస్థలుగా ప్రత్యేక ప్రతిపత్తి కలిగి ఉంటాయని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు బుధవారం నుంచే అమలులోకి వచ్చినట్టు పేర్కొన్నారు. టౌన్ షిప్‌లుగా ప్రకటించిన ఇండస్ట్రియల్ పార్క్‌ల్లో మాదాపూర్, ఇబ్రహీంపట్నం, కుత్బుల్లాపూర్, వరంగల్ ఉన్నాయి. అలాగే ప్రస్తుతం ఐటీ పార్క్‌లు, సెజ్‌లుగా ఉన్న నానక్‌రామ్‌గూడ, గచ్చిబౌలిని టౌన్ షిప్‌లుగా మార్చినట్టు పేర్కొన్నారు. మాదాపూర్ టౌన్ షిప్ పరిధిలో హైదరాబాధ్ నాలెడ్జ్రి సిటీ రాయదుర్గ్, మియాపూర్, కుత్బుల్లాపూర్, గాజుల రామారం ఉంటాయని పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం టౌన్ షిప్ పరిధిలో కొంగరకలాన్, కాంపోజిట్ మ్యాన్‌ఫాక్చరింగ్ క్లస్టర్ (ఇబ్రహీంపట్నం) ఉంటాయని పేర్కొన్నారు. వరంగల్ టౌన్ షిప్ పరిధిలో ఐటీ పార్క్, టెక్స్‌టైల్ పార్క్ (మణికొండ), కాకతీయ టెక్స్‌టైల్ పార్క్ ఉంటాయని పేర్కొన్నారు. టౌన్‌షిప్‌లుగా నోటిఫై చేసిన వాటిలో తెలంగాణ స్టేట్ ఇండస్ట్రీయల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టిఎస్‌ఐఐసి) రోడ్లు, డ్రైనేజి తదితర ఇతర వౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తుందని అరవింద్‌కుమార్ పేర్కొన్నారు. కొత్తగా ప్రకటించిన టౌన్‌షిప్‌లు జిహెచ్‌ఎంసి, నగర పంచాయతీ, మున్సిపాల్టీలు దేని పరిధిలోకి రాకుండా ప్రత్యేక స్థానిక సంస్థలుగా కొనసాగుతాయన్నారు. ఈ టౌన్‌షిప్‌లు 35 శాతం ఆదాయాన్ని సంబంధిత స్థానిక సంస్థలకు చెల్లించనున్నట్టు అరవింద్‌కుమార్ పేర్కొన్నారు.