రాష్ట్రీయం

మనోభావాలు దెబ్బతీయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఫిబ్రవరి 22: ‘మా మనోభావాలు దెబ్బతీయొద్దు. ఆత్మ గౌరవాన్ని కించపర్చకండి. విభజనతో నష్టపోయిన ఏపీకి న్యాయం చేయండి’ అని కేంద్రాన్ని డిమాండ్ చేయనున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ‘రాష్ట్ర విభజనతో నష్టపోయాం. ఈ సమయంలో కొత్త రాష్ట్రంలో తొలిసారి అధికారంలోకి వచ్చిన టీడీపీ అభివృద్ధికి చేసిన కృషి చాలావుంది. ఈక్రమంలోనే రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్రాన్ని పదేపదే కోరాను. 29మార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసి ప్రజల బాధలు వివరించా. కానీ కేంద్రం సరైన సహకారం ఇవ్వకపోగా అరకొర నిధులిచ్చి చేతులు దులుపుకుంది’ అని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని ఎర్రమంచి గ్రామంలో గురువారం ఉదయం కియా కార్ల కంపెనీ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. మధ్యాహ్నం అక్కడికి సమీపంలో టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక హోదా కోసం తాము డిమాండ్ చేశామన్నారు. అయితే విభజన హామీలు, ప్రత్యేక హోదాలో ఏమొస్తాయో, అంతకుమించి నిధులిస్తామని కేంద్రం చెప్పడం వల్లే ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నామని పునరుద్ఘాటించారు. విభజన చట్టం హామీలను నెరవేరుస్తామన్నారు. ఈ దశలో కేంద్రంతో పొత్తు పెట్టుకున్న తాము దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలతో పాటు అన్ని విధాలా ఎదిగేవరకూ విభజిత కొత్త రాష్ట్రానికి పూర్తిగా సహకరించాలని కోరామన్నారు. అప్పటి నుంచి తగిన సహకారం, ఆర్థికంగా ఆదుకునివుంటే ఇప్పటికి ఎంతో అభివృద్ధి సాధించే వాళ్లమని అన్నారు. ప్రస్తుతం దక్షిణ భారత దేశంలోని రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో తలసరి ఆదాయం రూ. 35వేల కంటే తక్కువగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించడం వల్లే నష్టపోయామని ఆరోపించారు. సమైక్యాంధ్ర పేరుతో కేంద్రంతో లాలూచీ పడిందని ఆరోపించారు. హేతుబద్ధత లేకుండా రాష్ట్ర విభజన చేసి మన పొట్టగొట్టారన్నారు. విభజన కష్టాల్లో సీఎం అయ్యానని గుర్తు చేశారు. ఎన్నో కష్టాలు, లోటు బడ్జెట్ మధ్య హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చి, రాష్ట్భ్రావృద్ధి కోసం రాజధాని ఏర్పాటుకు బస్సులో ఉంటూ పరిపాలన సాగించామన్నారు. 30వేల ఎకరాల భూమిని ప్రజలు తమ ప్రభుత్వంపై నమ్మకంతో రాజధానికి ఇచ్చారన్నారు. ఇక రూ. 24వేల కోట్లు రైతులకు రుణ విముక్తి కల్పించానన్నారు. రూ. 50వేలతో వన్‌టైమ్ సెటిల్‌మెంట్ చేశానన్నారు. రూ. 1.5 లక్షలను నాలుగు దఫాలుగా 10 శాతం వడ్డీతో ఇచ్చానన్నారు. పోలవరాన్ని వచ్చే ఏడాదికి పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. నదుల అనుసంధానంలో విజయం సాధిస్తున్నామన్నారు. పట్టిసీమను పూర్తి చేసి రాయలసీమకు నీరందిస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరడం మా హక్కు అన్నారు. అయితే, కొన్ని రాజకీయ పార్టీలు నిత్యం తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నాయన్నారు. తనను తిడితే ఓట్లు పడతాయని వారు అనుకుంటున్నారు, కానీ కేంద్రాన్ని సాయం కోసం అడగరని విమర్శించారు. రాష్ట్రంలో సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రతిష్ట పెంచే పని ఎవరు చేసినా ఆమోదిస్తా, తానూ సహకరిస్తా. కలిసి వస్తే వారితో పని చేస్తానని ప్రకటించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత, జవహర్, అమర్‌నాథ్, చీఫ్ విప్‌లు పల్లె రఘునాథరెడ్డి, పయ్యావుల కేశవ్, ఎంపీలు నిమ్మల కిష్టప్ప, పెనుకొండ ఎమ్మెల్యే పార్థసారధి, ఇతర ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు.

చిత్రం..ఎర్రమంచిలో తెదేపా నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు