రాష్ట్రీయం

లైఫ్ సైనె్సస్‌లో మేమే టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 22: లైఫ్ సైనె్సస్, ఐటీ రంగాల్లో తెలంగాణ దేశంలో ముందువరసలో ఉండటంతోపాటు అంతర్జాతీయంగా అగ్రరాజ్యాల సరసన నిలుస్తోందని రాష్ట్ర ఐటీ మంత్రి కె తారకరామారావు వెల్లడించారు. గురువారం హైటెక్ సిటీలో (హెచ్‌ఐసిసి) ప్రారంభమైన 15వ బయో ఆసియా సదస్సును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. లైఫ్ సైనె్సస్, ఐటీ రంగాలకు కేంద్రం కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. బయో ఆసియా సదస్సులో పాల్గొనేందుకు వివిధ దేశాలనుంచి వచ్చిన ప్రతినిధులకు తెలంగాణ ప్రభుత్వం ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. లైఫ్ సైనె్సస్‌కు హైదరాబాద్ కేంద్రబిందువుగా మారిందన్నారు. అంతర్జాతీయంగా అవసరమవుతున్న వాక్సిన్లలో 33శాతం తెలంగాణలోనే ఉత్పత్తి అవుతున్నాయని, దేశంలో లైఫ్ సైనె్సస్ ఉత్పత్తుల్లో 35శాతం తెలంగాణలోనే కావడం గమనార్హమన్నారు. జీనోంవ్యాలీ, ఫార్మాసిటీ, మెడికల్ డివైజెస్ పార్క్ తదితరాలు అంతర్జాతీయంగా తెలంగాణకు గుర్తింపు తెచ్చాయన్నారు. జీనోంవ్యాలీకి ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ (ఐఏఎల్‌ఏ) హోదా ఇస్తామని గత ఏడాది తానిచ్చిన హామీ అమల్లోకి వచ్చిందని గుర్తు చేశారు. ఈ వ్యాలీలో ప్రస్తుతం 200 కంపెనీలు పని చేస్తున్నాయని, దాదాపు 10 వేలమంది శాస్తవ్రేత్తలు, సాంకేతిక సిబ్బంది పని చేస్తున్నారన్నారు. నోవార్టిస్, జిఎస్‌కె, సనోఫి తదితర అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణలో ఉండటం గర్వకారణమన్నారు. జీనోంవ్యాలీ ఆసియా ఖండంలోనే అతిపెద్ద క్లస్టర్‌గా పేరు తెచ్చుకుందని, ఆ స్థాయిని నిలబెట్టుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ విధానంతో ఒకేచోట అన్నిరకాల అనుమతులు పొందేందుకు లైఫ్ సైనె్సస్ కంపెనీలకు అవకాశం లభించిందని, దీంతో
దేశంలో తెలంగాణ ప్రథమస్థానంలో కొనసాగుతోందని అన్నారు. అంతర్జాతీయంగా లైఫ్ సైనె్సస్‌లో గుర్తింపువున్న కంపెనీలను బయో ఆసియా ద్వారా తెలంగాణ ఆకర్షిస్తోందన్నారు. వచ్చే పదేళ్లలో ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రంగాల్లో రావాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని, కనీసం నాలుగు లక్షలమంది యువతకు ఉపాధి లభిస్తుందని ఆశిస్తున్నట్టు కేటీఆర్ వెల్లడించారు.
తెలంగాణలో ఏర్పడుతున్న పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన యువతను తయారు చేసేందుకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ఏర్పాటు చేశామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ కేంద్రంలో శిక్షణపొందిన వేలాది యువతకు ఇప్పటికే ఉద్యోగాలు లభించాయన్నారు. రాష్ట్రంలోని విద్యాసంస్థలు, పారిశ్రామికవర్గాలు కూడా తమవంతు సహకార అందించాలని కేటీఆర్ కోరారు. ఇమ్యునోథెరపీ, పర్సనైజ్‌డ్ మెడిసిన్, నానోమెడిసిన్‌ల కోసం ఒక ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేయాలన్న యోచన ఉందన్నారు. లైఫ్ సైనె్సస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నామని, కనీసం 3వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను పోగుచేయాలన్న ప్రణాళిక ఉందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. త్వరలోనే హైదరాబాద్‌లో ఫార్మా సిటీ ఏర్పాటు కాబోతోందని, కేంద్రం నుంచి ఇందుకు అవసరమైన అనుమతులు లభించే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. దీనికి ఇప్పటికే అంతర్జాతీయ సంస్థల నుండి, కేంద్రం నుండి మంచి సహకారం లభిస్తోందన్నారు. ఇలావుంటే, మెడికల్ డివైజెస్ రంగంలోనూ పెట్టుబడులకు అనేక అవకాశాలు ఉన్నాయన్నారు. తెలంగాణ మెడికల్ డివైజెస్ పార్క్ దేశంలోనే అతిపెద్దదిగా పేరు సాధించిందన్నారు. ఫార్మా, బయోటెక్, మెడికల్ డివైజెస్ కంపెనీల మధ్య సత్సంబంధాలు ఉండేలా చూస్తున్నామని కేటీఆర్ తెలిపారు. సమావేశంలో తెలంగాణ లైఫ్ సైనె్సస్ అడ్వయిజరీ కమిటీ చైర్మన్ డి బాలసుబ్రహ్మణ్యం, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తదితులు పాల్గొన్నారు. 50 దేశాల నుంచి 1500మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రొఫెసర్ మైకెల్ హాల్‌కు జీనోం ఎక్సలెన్సీ అవార్డును అందించారు. రెండురోజులపాటు ఈ సమావేశాలు కొనసాగుతాయి.

చిత్రం..బయో ఆసియా సదస్సులో మాట్లాడుతున్న తెలంగాణ మంత్రి కేటీఆర్