రాష్ట్రీయం

గోవర్థనగిరిధారిగా యాదగిరీశుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఫిబ్రవరి 22: యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామి బ్రహ్మోత్సవాల్లో ఆరవ రోజు గురువారం ఉగ్రనృసింహుడు గోవర్థనగిరిధారి అలంకార సేవలో సింహవాహన రూఢుడై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని చిటికిన వేలితో ఎత్తి ఇంద్రుడికి గర్వభంగం చేసి గోకులాన్ని, జీవరాశులను సంరక్షించిన సందర్భాన్ని సాక్షాత్కరిస్తూ యాదగిరీశుడు గోవర్ధనగిరిధారిగా అలంకృతుడై భక్తజనులకు అభయమిచ్చారు. రాత్రివేళ సింహవాహనంపై విహరించిన భక్తులను తరింపచేశారు. బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన లక్ష్మీనృసింహుల కల్యాణోత్సవానికి ముందు నిర్వహించే ఎదుర్కోలు ఘట్టం శుక్రవారం ఘనంగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేపట్టింది. ఏడవ రోజు శుక్రవారం ఉదయం 11గంటలకు బాల ఆలయంలో లక్ష్మీనరసింహుడికి జగన్మోహిని అలంకార సేవ, రాత్రి 9గంటలకు అశ్వవాహన సేవ, ఎదుర్కోలు ఘట్టాలు నిర్వహించనున్నారు.

చిత్రం..గోవర్ధనగిరిధారిగా భక్తులకు దర్శనమిస్తున్న యాదగిరి లక్ష్మీనారసింహుడు