రాష్ట్రీయం

లీకులపై జీపీఎస్ నిఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 24: ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేసినట్టు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ తెలిపారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు 28 నుంచి, సెకండియర్ పరీక్షలు 29 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. 26 నుండి బోర్డు పోర్టల్‌లో హాల్‌టిక్కెట్లు ఉంచుతామని, అభ్యర్ధులు వాటిని డౌన్‌లోడ్ చేసుకుని కూడా పరీక్షలకు హాజరుకావచ్చని చెప్పారు. అలాగే పరీక్ష కేంద్రాల గుర్తింపునకు గూగుల్ ప్లేస్టోర్‌లో యాప్ అందుబాటులో ఉందని, దానిద్వారా పరీక్ష కేంద్రాల చిరునామాను తేలికగా తెలుసుకోవచ్చని అన్నారు. పరీక్ష రాస్తున్న విద్యార్థులు గంటముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఎటువంటి ఉద్రిక్తత లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలంటే విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని చెప్పారు. 28 నుండి మార్చి 14 వరకూ ప్రధాన పరీక్షలు జరుగుతాయని, ఇందుకోసం 1294 కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో 527 కేంద్రాలు, ప్రైవేటు కాలేజీల్లో 767 కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. 1294 మంది చీఫ్ సూపరింటెండెంట్‌లను నియమించామని, మరో 1294 మంది డిపార్టుమెంటల్ ఆఫీసర్లు, 25,395 మంది ఇన్విజిలేటర్లను నియమించామని అందులో జూనియర్ లెక్చరర్లు 19,307 మంది, స్కూల్ టీచర్లు 6088 మందిని ఇన్విజిలేటర్లుగా నియమించామని అన్నారు. పరీక్షలకు 9,63,546 మంది హాజరవుతున్నారని, అందులో ఫస్టియర్ నుండి 4,55,635 మంది, సెకండియర్ నుండి 5,07,911 మంది ఉన్నారని ఫస్టియర్‌లో అమ్మాయిలు 2,11,704 మంది, అబ్బాయిలు 2,03,512 మంది, సెకండియర్‌లో అమ్మాయిలు 2,05,015 మంది, అబ్బాయిలు 1,90,488 మంది ఉన్నారని ఇక ఫస్టియర్ వొకేషన్ అభ్యర్ధులు 40,420 మంది, సెకండియర్ వొకేషనల్ 33,689 మంది ఉన్నారని వొకేషనల్ ప్రైవేటు అభ్యర్ధులు 4267 మంది, జనరల్ ప్రైవేటు అభ్యర్ధులు 74,452 మంది ఉన్నారని బోర్డు కార్యదర్శి పేర్కొన్నారు.
జిల్లా పరీక్షల కమిటీలను నియమించామని, డిఐఇఓలను కన్వీనర్లుగా నియమించామని పేర్కొన్నారు. జిల్లా స్థాయి హైపవర్ కమిటీ చైర్మన్‌గా కలెక్టర్ ఉంటారని, అందులో ఎస్పీ, ఆర్‌జెడి, డిఐఇఓ సభ్యులుగా ఉంటారని, ఒక సీనియర్ ప్రిన్సిపాల్, ఒక సీనియర్ జెఎల్ కూడా ఉంటారని పేర్కొన్నారు. ఫ్లయంగ్ స్క్వాడ్‌లను, సిట్టింగ్ స్క్వాడ్‌లను నియమించామని, అలాగే పరీక్షల సమయంలో ఆర్టీసీ అధికారులతో మాట్లాడి సరిపడా బస్సులను నడపమని సూచించామని పేర్కొన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, తాగునీటి సరఫరా ఏర్పాట్లు చేయాలని ఆదేశించామని అన్నారు. పరీక్ష కేంద్రాల్లో సిసి కెమరాలు కూడా ఏర్పాటు చేశామని, జిపిఆర్‌ఎస్ ద్వారా పరీక్ష పత్రాల నియంత్రణపై నిఘా పెట్టామని అన్నారు. అలాగే సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను మూసివేస్తామని, రాష్ట్ర బోర్డు కార్యాలయం నుండి కూడా అధికారులను పరిశీలకులుగా నియమించామని అన్నారు. అభ్యర్థుల బయోడాటా, ఒఎంఆర్ షీట్లను పావుగంట ముందే నింపిస్తామని, కనుక 8.45కి పరీక్ష కేంద్రాల్లో ఉండాలని, ఉదయం 9 తర్వాత వచ్చే అభ్యర్ధులను పరీక్ష హాలులోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. అక్రమాలకు ప్రయత్నిస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు.