రాష్ట్రీయం

పనితీరు భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 24: భూరికార్డుల ప్రక్షాళనను విజయవంతంగా పూర్తి చేసిన రెవెన్యూ ఉద్యోగులకు నెల మూలవేతనాన్ని ప్రోత్సాహకంగా ఇవ్వనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. భూరికార్డుల ప్రక్షాళన, కొత్త పాస్‌పుస్తకాల పంపిణీపై ప్రగతిభవన్‌లో శనివారం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రోత్సాహక నిర్ణయంతో 10,809 మంది రెవెన్యూ ఉద్యోగులు, 24,410 మంది వీఆర్‌ఏలు, 530మంది సర్వే విభాగం ఉద్యోగులకు లబ్ది జరుగుతుందన్నారు. మొత్తం 35,749 మంది ఉద్యోగులకు నెల మూల వేతనం అదనంగా లభిస్తుందన్నారు. రెవెన్యూ ఉద్యోగులు రేయింబవళ్లు కష్టపడి కేవలం 100 రోజుల్లో భూరికార్డుల ప్రక్షాళన పూర్తి చేశారన్నారు.
తెలంగాణ ప్రజల తరఫున, రైతుల పక్షాన రెవెన్యూ ఉద్యోగులందరికీ మనసారా కృతజ్ఞతలు తెలియచేస్తున్నానన్నారు. దాదాపు 80 ఏళ్ల నుండి భూరికార్డుల ప్రక్షాళన కాలేదని, క్రయవిక్రయాలు సరిగ్గా నమోదు కాలేదని, దాంతో భూరికార్డుల అంశం గందరగోళంగా మారిందని కేసీఆర్ గుర్తు చేశారు. పంటల పెట్టుబడి పథకం అమలు చేసేందుకు ఏ భూమి ఎవరి పేరుతో ఉందో స్పష్టంగా తేలిపోయిందన్నారు. అసైన్డ్‌దారుల విషయంలోనూ స్పష్టత వచ్చిందన్నారు. రాష్ట్రంలో 22.5 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచగా, అందులో 20 లక్షల ఎకరాల భూముల విషయంలో స్పష్టత వచ్చిందన్నారు. మిగతా రెండున్నర లక్షల ఎకరాల విషయంపై వివరాలు సేకరిస్తున్నామన్నారు. కొత్తజిల్లాలు ఏర్పాటు చేయడం వల్ల, జిల్లాల విస్తీర్ణం తగ్గి రికార్డుల ప్రక్షాళన సులువైందని సీఎం కేసీఆర్ అన్నారు.