రాష్ట్రీయం

రైతే రాజైతే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 24: వ్యవసాయ రంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, కార్యక్రమాలు రైతులకు చేరేందుకు రైతు సమన్వయ సమితులను పూర్తిగా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామస్థాయి, మండల స్థాయి రైతు సమన్వయ సమితిలను ఇప్పటికే ఏర్పాటు చేశారు. జిల్లా, రాష్టస్థ్రాయి సమితిలను ఏర్పాటు చేస్తున్నారు. రైతు సమన్వయ సమితుల ప్రతినిధులతో నేరుగా చర్చించి, సమస్యలు తెలుసుకునేందుకు రైతు సమన్వయ సమితుల ప్రాంతీయ సదస్సులను ఏర్పాటు చేస్తున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో, సోమవారం కరీంనగర్‌లో ఈ సమావేశాలు నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. దక్షిణ తెలంగాణ జిల్లాలకు చెందిన రైతు సమన్వయ సమితుల ప్రతినిధులకోసం హైదరాబాద్‌లో ఆదివారం సమావేశం జరుగుతోంది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించిన మండల రైతు సమన్వయ సమితుల ప్రతినిధులతో కరీంనగర్‌లో సోమవారం సదస్సు జరుగుతోంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు స్వయంగా రైతులతో మాట్లాడేందుకు ఈ రెండు సదస్సులకు హాజరవుతున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత టిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం, వ్యవసాయ అభివృద్ధి కోసం అనేక పథకాలు, కార్యక్రమాలు చేపట్టింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే లక్ష రూపాయల వరకు బ్యాంకులకు బకాయి ఉన్న రైతుల రుణాలను మాఫీ చేశారు. మొత్తం 17 వేల కోట్ల రూపాయలు ఇందుకోసం వినియోగించారు. 24 గంటల పాటు వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్తు ఇవ్వడం ప్రారంభించడంతో రైతుల్లో ఆనందం తాండవిస్తోంది. గత నాలుగేళ్లలో వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణాధికారుల ఖాళీలను భర్తీ చేసి సేద్యం శాఖను బలోపేతం చేశారు. విత్తనాలు, ఎరువులను సకాలంలో ఇస్తున్నారు. 2017-18 సంవత్సరంలో 10 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సబ్సిడీపై ఇచ్చేందుకు 169 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. రైతుల భూములను పరీక్షించి దాదాపు 90 శాతం మంది రైతులకు ‘సాయిల్ హెల్త్‌కార్డు’లు ఇచ్చారు. అలాగే 27 లక్షల టన్నుల ఎరువులను సబ్సిడీపై సరఫరా చేశారు.
మధ్యవర్తిగా రైతు సమన్వయ సమితి
రైతులకు ప్రభుత్వానికి మధ్య వారధిగా రైతు సమన్వయ సమితిలు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇక నుండి రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి కోసం చేపట్టే ప్రతి పథకం, ప్రతి కార్యక్రమం ఈ సమితుల ద్వారా అమలు చేయాలని కేసిఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం నిర్వహిస్తున్న రైతు సమన్వయ సమితిల సమావేశాల ద్వారా ప్రాక్టికల్ సమస్యలు తెలుస్తాయని సిఎం భావిస్తున్నారు.

కేసీఆర్ ఫాంహౌస్‌లోని పాలిహౌస్
పుష్కలంగా నీరు
కెసిఆర్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ వల్ల నేను తీసుకున్న 25 వేల రూపాయల రుణం మాఫీ అయింది. మా ఊరికి కృష్ణా నీళ్లు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (కెఎల్‌ఐ) ద్వారా వస్తున్నాయి. కెఎల్‌ఐ నీటితో మా ఊళ్లోని తుమ్మకుంట చెరును గత రెండేళ్ల నుండి నింపుతున్నారు. దాంతో వానాకాలం, యాసంగి పంటలు పండుతున్నాయి. కాలువ కింద ఎనిమిది ఎకరాల్లో ఒక్కో పంటకు 360 బస్తాల వరకు వరిధాన్యం పండుతోంది. అలాగే బావి కింద ఉన్న రెండు ఎకరాలకు ఉచిత కరెంట్ వల్ల సాగు నీరు అందుతోంది.
- పి. శేషగిరిరావు, రైతు,
అంకిరావుపల్లి, కొల్లాపూర్ మండలం, నాగర్‌కర్నూలు జిల్లా.
సేంద్రీయ సేద్యం
సేంద్రీయ సేద్యాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాలి. సేంద్రీయ విధానంలో సాగు చేస్తున్న రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలి. భూసారపరీక్షలు సమర్థతగా నిర్వహించాలి. పంటలకు లాభసాటి ధర లభించేలా చూడాల్సి ఉంది. ఎకరాకు నాలుగువేల పెట్టుబడి ఇవ్వడం సముచిత నిర్ణయం. బ్యాంకుల నుండి రైతులకు రుణాలు లభించడం లేదు. ప్రభుత్వ రంగం, సహకార రంగంలోని చక్కెర కర్మాగారాలను తెరిపించారు.
- కె. సాయిరెడ్డి,
బికెఎస్ జాతీయ నాయకులు

చిత్రం..సీఎం కేసీఆర్ వ్యవసాయ భూమిలో అతిపెద్ద బావి