రాష్ట్రీయం

కోణార్క్‌లో బాంబు కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధిర, ఫిబ్రవరి 24: భువనేశ్వర్ నుండి ముంబాయి వెళ్లే కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో అనుమానాస్పదంగా ఉన్న రెండు బాక్సులను రైల్వే పోలీసులు రైలు బోగీ నుండి స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. కోణార్క్ ఎక్స్‌ప్రెస్ శనివారం ఉదయం విజయవాడ రైల్వే స్టేషన్ దాటిన తరువాత ఎస్ 11బోగీ 57వ సీటు కింద గుడ్డ సంచీలో రెండు బాక్సులు ఉండటాన్ని ప్రయాణికులు గమనించి ఆ విషయాన్ని టీసీకి తెలపడంతో ఆయన కంట్రోల్ రూంకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న ఖమ్మం జిల్లా మధిర రైల్వే పోలీస్‌లు ఉదయం 6-30 గంటల సమయంలో ట్రైన్ మధిర రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే ఆ బోగి వద్దకు వెళ్ళి ట్రైన్‌లో ఉన్న ఆ సంచిని కిందకు దించి ట్రైన్‌ను పంపించివేశారు. రైల్వే పోలీసులు ఇచ్చిన సమాచారంతో స్థానిక టౌన్ ఎస్‌ఐ బి.తిరుపతిరెడ్డి రైల్వే స్టేషన్‌కు వెళ్ళి ఈ విషయాన్ని రైల్వే, సివిల్ పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించారు. దీంతో ఖమ్మం నుండి డాగ్‌స్క్వాడ్, బాంబ్ టీమ్ హుటాహుటిన మధిరకు వచ్చి బాంబులు ఉన్న బాక్సులను పరిశీలించాయి. అయితే ఆ బాక్సులకు ఎనామిల్ పెయింట్ వేసి ఉండటం, రంగు వాసన వస్తుండటంతో పోలీస్ జాగిలం కూడా ఆ బాక్సులలో ఉన్నది బాంబులా కాదా అనేది పసిగట్టలేకపోవడంతో ఈ విషయాన్ని తిరిగి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. విషయం క్లిష్టంగా ఉండటంతో హైదరాబాద్ నుండి ప్రత్యేక టీమును రప్పించేందుకు చర్యలు చేపట్టారు. ఈ బాంబు బాక్సులు ఉంచిన సంచీ పై శ్రీలలిత ఎంటర్‌ప్రైజెస్, అనంతపురం అని ఉంది. అనంతపురం అడ్రస్ ఉన్న సంచీలో అనుమానాస్పదంగా ఉన్న బాక్సులు ఉంచి భువనేశ్వర్ నుండి వస్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో పెట్టడంతో ఇవి ఎక్కడి నుండి ఎక్కడికి వెళుతున్నాయో అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎస్ 11బోగీలో రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికుల చిరునామాలు తీసుకొని వారిని విచారించేందుకు కూడా పోలీసులు చర్యలు చేపడుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అనుమానాస్పందంగా ఉన్న బాంబు బాక్సులను సత్తుపల్లి ఎసిపి బి.రాజేష్, ఖమ్మం రైల్వే సిఐ చంద్రబాను, మధిర సిఐ సిహెచ్ శ్రీ్ధర్ ఖమ్మం ఆర్‌పిఎఫ్ ఎస్‌ఐలు బి.జనార్ధన్, యం. వెంకటరెడ్డి, జిఆర్‌పి ఎస్‌ఐ రవికుమార్, మధిర టౌన్ ఎస్‌ఐ బి. తిరుపతిరెడ్డి తదితరులు పరిశీలించారు. హైదరాబాద్ నుండి ప్రత్యేక బాంబ్ నిర్వీర్య దళం వచ్చి ఈ బాక్సులను పరిశీలించిన తరువాత మాత్రమే వాటిలో ఏమి ఉన్నదనేది వెల్లడౌతుందని పోలీస్ అధికారులు తెలిపారు.

చిత్రం..అనుమానాస్పద బాక్సులు తనిఖీ చేస్తున్న డాగ్‌స్క్వాడ్