రాష్ట్రీయం

కలిసికట్టుగా ముందుకెళ్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 25: ‘కలిసి సాగుదాం. తెరాస పాలనకు చరమగీతం పాడుదాం’ అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి పార్టీ సీనియర్లు, నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రజా చైతన్య బస్సు యాత్ర సోమవారం నుంచి చేవెళ్లనుంచి మొదలవుతున్న సంగతి తెలిసిందే. లోగడ వైఎస్ రాజశేఖర రెడ్డి 2003లో చేవెళ్ళ నుంచి శ్రీకాకుళం వరకూ పాదయాత్ర నిర్వహించి 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు. అయితే చేవెళ్ళ సెంటిమెంట్ ఇప్పుడు కాంగ్రెస్‌కు కలిసొస్తుందా? లేదా? అనేది ఒక అంశం కాగా, అసలు ఎంతమంది ముఖ్య నేతలు బస్సెక్కుతారన్నది రెండో ప్రశ్న. మరోపక్క అధ్యక్షుడే అందరినీ కలుపుకుని పోవడం లేదన్న విమర్శ పార్టీలో అంతర్గతంగా వినిపిస్తోంది. ఎన్నికలకు ఇక ఏడాది సమయమే మిగిలి ఉన్నందున పార్టీలో ప్రతి ఒక్కరితో చురుగ్గా పని చేయించేందుకు ఉత్తమ్ ప్రణాళిక రూపొందించారు. పార్టీలో ఒక్కోక్కరిదీ ఒకదారి అనే విమర్శను దూరం చేసేలా ప్రజా చైతన్య బస్సు యాత్ర ద్వారా నేతలందరినీ బస్సు ఎక్కించాలని ప్రయత్నిస్తున్నారు. ఈమేరకు గత 2రోజులుగా పార్టీ సీనియర్లను సంప్రదిస్తున్నారు. బస్సు యాత్ర ద్వారా ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రభుత్వాన్ని ఎండగట్టడంతోపాటు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలన్నది పార్టీ యోచన. 26న ఉదయం 10 గంటలకు నాంపల్లిలోని దర్గాకు ముఖ్య నేతలు
చేరుకుని ప్రార్థనలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి 11 గంటలకు గండిపేట రోడ్డులోని ఆరే మైసమ్మ దేవాలయంలో, 12 గంటలకు మొయినాబాద్ చర్చిలో ప్రార్థనలు నిర్వహించి, నేరుగా చేవెళ్ళకు చేరుకుంటారు. సరిగ్గా ఒంటి గంటకు ముఖ్య నాయకుల ప్రసంగంతో ప్రజా చైతన్య యాత్ర ప్రారంభమవుతుంది. యాత్ర సాయంత్రం 4 గంటలకు వికారాబాద్‌కు చేరుకుంటుంది. వికారాబాద్‌లో బహిరంగ సభ అనంతరం రాత్రి నాయకులంతా అక్కడే బస చేస్తారు. 27న ఉదయం యాత్ర ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంటకు తాండూరుకు చేరుకుంటుంది. సాయంత్రం 4 గంటలకు సంగారెడ్డిలో సభ, అనంతరం రాత్రి అక్కడే బస చేస్తారు. ఆ మర్నాడు అంటే 28న మధ్యాహ్నం 1 గంటకు జహీరాబాద్, సాయంత్రం 4 గంటలకు నారాయణ్‌ఖేడ్‌లో సభ జరుగుతుంది.
అహంకారం పెరిగింది
*సిఎంపై ఉత్తమ్ విసుర్లు
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అహంకారం పెరిగిందని ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను బస్సు యాత్ర ద్వారా ఎండగడతామని ఆయన తెలిపారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఇదే ఆఖరి బడ్జెట్ అని, మళ్లీ అధికారంలోకి రాదని ఆయన జోస్యం చెప్పారు.