రాష్ట్రీయం

మోదీ-బాబు మ్యాచ్ ఫిక్సింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 25: ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్లమెంట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని నాటకాలాడుతూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ ఆరోపించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కని, హోదా కచ్చితంగా ఇచ్చి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వస్తే తొలి సంతకం ప్రత్యేక హోదా పైనేనని ప్రకటించారు. ఆదివారం విజయవాడలో ఆయన విభజన అంశంపై విలేఖరులతో మాట్లాడారు. ఎన్డీఏ నేతృత్వంలోని మోదీ ప్రభుత్వం కావాలనే ఆంధ్రప్రదేశ్‌ను విస్మరించిందని దుయ్యబట్టారు. రాష్ట్ర పునర్విభజన బిల్లు-2014లో పొందుపరిచిన ఏ హామీని అమలు చేయకుండా రాష్ట్రానికి అన్యాయం చేసిందని విమర్శించారు. పార్లమెంట్‌లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన ప్రకటనలు అమలు చేయడం లేదని, 2014లో తిరుపతిలో నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసగిస్తున్నారని జైరాం రమేష్ ఆక్షేపించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన ద్వారా 2014లో ప్రజాగ్రహాన్ని చవిచూసిందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన సమయంలో తాము బిల్లులో పొందుపరిచిన 11 అంశాల్లో ఇప్పటివరకు ఏ ఒక్కదానికీ సవరణలు చేయించలేకపోవడం బిల్లు ఎంత పగడ్బందీగా రూపొందించామని చెప్పడానికి నిదర్శనమన్నారు. రాష్ట్ర విభజన అశాస్ర్తియమని పదేపదే చెబుతున్న చంద్రబాబు, ఇంతవరకు విభజన బిల్లులోని ఏ ఒక్క అంశానికి ఎందుకు మార్పు చేయించలేదని ప్రశ్నించారు. పోలవరం నిర్మాణాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టాల్సి ఉన్నా, కేవలం తమకు కావలసిన కొందరు కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ బాధ్యతను భుజాన వేసుకుందని ఆయన ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ పోలవరం పోస్టల్ అథారిటీగా కేవలం ఉత్తర ప్రత్యుత్తరాలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. టీడీపీ-బీజేపీ లేఖల యుద్ధం చేసుకుంటున్నాయని, ఈ రెండు పార్టీల మోసాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. 2019లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై తొలి సంతకం చేస్తుందని జైరాం రమేష్ హామీ ఇచ్చారు.