జాతీయ వార్తలు

ఆదర్శ భారతమే ఆశయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 29: శ్రేయో, శ్రేష్ఠ, ఆదర్శ భారతమే ఆదర్శమని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దేశ సమైక్యత, సామరస్య సాధన కోసం ప్రతి ఒక్కరినీ మమేకం చేయడానికి ఇందుకు సంబంధించి విశిష్ట పధకాన్ని తీసుకురావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఆదివారం దేశ ప్రజలనుద్దేశించి ఆకాశవాణిలో చేసిన మన్‌కీ బాత్‌లో తన మనోభావాలను ఆవిష్కరించిన మోదీ ‘అంతర్గత చైతన్యం, అప్రమత్తతతోనే స్వేచ్ఛా స్వాతంత్య్రాలను పరిరక్షించుకోగలుగుతాం’ అని ఉద్ఘాటించారు. సమైక్యత, సామరస్యం వంటి ఉన్నత ఆదర్శాలను బలోపేతం చేయడానికి ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ పథకం ఎంతగానో దోహదం చేస్తుందని తెలిపారు. దేశ సమైక్యతా సంస్కృతిని ఎప్పటికప్పుడు శక్తివంతంగా తీర్చిదిద్దుకుంటూ ముందుకు సాగాలని తెలిపారు. గత నెల 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఏక్‌భారత్, శ్రేష్ఠ భారత్ ఆశయాల గురించి తాను ప్రస్తావించానని, వీటి సాధనకు ప్రత్యేక పథకాన్ని తీసుకురావాలన్న ఆలోచనతో ఉన్నానని తెలిపారు. ‘మై గవర్నమెట్’ పోర్టల్‌ను మరింత క్రియాశీలకంగా, చైనత్యవంతంగా మార్చేందుకు ప్రజలు తమ అభిప్రాయాలు తెలియజేయాలన్నారు. దీని నిర్మాణం, లోగోకు సంబంధించే కాకుండా ప్రజలందరూ ఇందులో క్రియాశీలకంగా పాల్గొనేందుకు ఏవిధంగా ముందుకెళ్లాలో కూడా తెలియజేయాలన్నారు. సమైక్య, సామరస్య మంత్రంతో ప్రతి పౌరుడినీ ఎలా మమేకం చేయాలి, ఆ విధంగా శ్రేష్ఠ భారత లక్ష్యాన్ని ఏవిధంగా సాధించగలుగుతామో సృజనాత్మక రీతిలో తెలియజేయాలన్నారు. ముఖ్యంగా ఇందుకు ఉద్దేశించిన పథకం ఏవిధంగా ఉండాలి? దాని స్వరూప, స్వభావాలు ఎలా ఉండాలన్న దానిపైనే ప్రజలు తమ దృష్టిని కేంద్రీకరించి సలహాలివ్వాలన్నారు. ప్రభుత్వం, సమాజం, పౌర సమాజ పాత్రలను కూడా ఈక్రమంలో నిర్దేశించాల్సి ఉంటుందన్నారు. ఈ పథకంలో అడుగడుగునా జీవం కనిపించాలని, అత్యంత ప్రతిష్ఠాత్మక రీతిలో ప్రతి ఒక్కరూ చాలా తేలిగ్గానే పాల్గొనేలా ఉండాలని మోదీ కోరారు. దేశంలో మత వైషమ్యాలు, అసహన ధోరణులు పెరిగిపోతున్నాయన్న విమర్శల నేపథ్యంలో సమైక్యత, సామరస్య సాధనకు ప్రధాని మోదీ ఈ పథకం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

చిత్రం... విదేశీ పర్యటనకు బయలుదేరుతూ మోదీ